హెల్మెట్లు ధరించి ఉల్లి అమ్మకం..ఎందుకో తెలుసా?

హెల్మెట్లు ధరించి ఉల్లి అమ్మకం..ఎందుకో తెలుసా?
x
హెల్మెట్లు ధరించి ఉల్లిపాయలు అమ్ముతున్న దృశ్యం
Highlights

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ, ఇప్పుడు అదే ఉల్లి ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఉల్లిగడ్డల ధరలు ఆశానంటుతున్నాయి.

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ, ఇప్పుడు అదే ఉల్లి ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఉల్లిగడ్డల ధరలు ఆశానంటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరల నియంత్రలో ప్రభుత్వం చోరవ చూపడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో రూ.100 రూ. 120 వరకూ ఉంటున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలో అయితే ఉల్లి ధరలు వంద నుంచి ఐదు వందల రూపాయలు ఉంటున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఉల్లిగడ్డలు కొనాలంటేనే బెంబేలేత్తిపోతున్నారు.

ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం ప్రజలకు ఉల్లి ధరల నుంచి కాస్త ఉపశమనం కల్పించేందుకు యోచించింది. పాట్నా ప్రజలకు రూ.35కే కిలో ఉల్లిగడ్డలను అందిస్తోంది. అందుకు గాను బీహార్ రాష్ట్ర కార్పొరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ వారు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇది తెలిసిన ప్రజలు ఉల్లిగడ్డలు కొనడానికి బారులు తీరారు. భారీ సంఖ‌్యలో జనాలు ఉల్లిపాయలు కొనాలని ఎగబడుతున్నారు.

జనాలు భారీ సంఖ్యలు వస్తున్న ప్రభుత్వం తమను భద్రత ఏర్పాటు చేయలేదని విక్రేతలువాపోతున్నారు. జనాలను చూసి అధికారులు హెల్మెట్లు పెట్టుకొని ఉల్లిగడ్డను విక్రయిస్తున్నారు. ఉల్లి కోసం జనం రాళ్లతో దాడి చేయడం వాహనాలపైకి ఎక్కి ఎగబడతారని. ముందస్తుగా హెల్మెట్లు ధరించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories