శుభవార్త : రూ. 22కే కిలో విదేశీ ఉల్లి

శుభవార్త : రూ. 22కే కిలో విదేశీ ఉల్లి
x
Highlights

ఉల్లి కొనలేక ఇబ్బందులు పడుతున్నారా..? అధిక ధరతో ఉల్లిని వాడటం లేదా..? అయితే ఇక ఉల్లి ఇబ్బంది ఉండకపోవచ్చు. వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త...

ఉల్లి కొనలేక ఇబ్బందులు పడుతున్నారా..? అధిక ధరతో ఉల్లిని వాడటం లేదా..? అయితే ఇక ఉల్లి ఇబ్బంది ఉండకపోవచ్చు. వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని కిలో రూ. 22కే అన్ని రాష్ట్రాలకు విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని ప్రస్తుతం కేంద్రం.. రూ. 58కి అమ్ముతోంది. అయితే గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర తోపాటు మరికొన్నిరాష్ట్రాల్లో భారీగా ఉల్లి పంట చేతికి వస్తోంది.

దీంతో విదేశీ ఉల్లిని కొనుగోలు చేయడానికి రాష్ట్రాలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దానికి తోడు విదేశీ ఉల్లి రుచిలో దేశీయ ఉల్లి కన్నా తక్కువే.. దాంతో మన దేశంలోనే ఉల్లి దొరుకుంతుండటం.. రానున్న నెలరోజుల్లో మరింత ఉల్లి పంట అందుబాటులోకి రానుండటం.. వంటి కారణాలు.. విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకున్న ఉల్లిపై ప్రభావం పడే అవకాశం ఉంది. వాస్తవానికి గత నవంబర్‌లో కేంద్రం విదేశాల నుంచి 14 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. ఆ ఉల్లి అమ్ముడుకుండా పోర్టుల వద్దే మిగిలిపోయింది. అయితే ఈ ఉల్లి ఎక్కువ రోజులు నిలువ ఉండటంతో కుళ్లిపోతుండటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు ఉల్లిని కిలో రూ. 22 లేదంటే రూ.23 కే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.

శుభవార్త : రూ. 22కే కిలో విదేశీ ఉల్లిఇదిలావుంటే ఏపీలో కిలో ఉల్లి రూ. 25 కే కొన్నాళ్ళు విక్రయించింది రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం రూ.20 కే అందిస్తోంది. మరోవైపు ఉల్లి ధరలు పెరగడానికి వర్షాలే కారణం. మహారాష్ట్రతో పాటు ఉల్లిని ఎక్కువగా సాగుచేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఉల్లి ధరలు మూడు నెలల పాటు భగ్గుమన్నాయి. అయితే పెరిగిన ఉల్లి ధరలతో తెలుగు రాష్ట్రాల్లోని ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తీవ్రంగా నష్టపోయామని ఈసారైన మద్దతు ధర కంటే అధిక ధర లభించడం సంతోషకరమని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories