శివసేన కీలక నిర్ణయం

శివసేన కీలక నిర్ణయం
x
Highlights

మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి కలిసి 161 స్థానాలు కైవసం చేసుకున్నాయి.

మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి కలిసి 161 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ప్రతిపక్ష ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు కైవసం చేసుకున్నాయి. అయితే రెండు పార్టీల మధ్య సీఎం కుర్చీపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. మరోవైపు సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు దేవేంద్ర ఫడ్నవిస్‌ రెడీ అవుతున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఫడ్నవిస్‌‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం శాసనసభాపక్ష నేతగా షిండే పేరును శివసేన ఛీఫ్ ఆదిత్యా ఠాక్రే ప్రతిపాదించగా దానికి ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే తమ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ నుకలవనున్నారు. చర్చల సమోధ్యలో 13 మంత్రి పదవులు శివసేనకు కేటాయిస్తామని చెప్పడంతో ఆపార్టీకి మింగుడు పడడంలేదు. ఎన్నికల తర్వాత భేటీ అయినా శివసేన నేతలు తాజా రాజకీయాలపై చర్చించారు. బీజేపీకి మద్దతు ప్రకటనపై సమాలోచన చేయనున్నారు. శివసేన నేతలు మాత్రం తమ డిమాండ్లు పరిష్కరించాలని పట్టుపడుతుంది. తమ మద్దతు లేకుండా బీజేపీ సీఎంగా ఫడ్నవిస్‌ ప్రమాణస్వీకారం చేయలేరని వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ రెబల్ అభ్యర్థులు 17 మంది విజయం సాధించడంతో బీజేపీ ధీమాగా ఉంది. దీంతో శివసేన పార్టీ డిమాండ్లను బీజేపీ పట్టించుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేన పార్టీని తక్కువ అంచనా వెయోద్దని ఆపార్టీ నేత సంజయ్ హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories