బాలీవుడ్ ప్రముఖుల ఆస్తులపై కొనసాగుతోన్నఐటీ రైడ్స్

Highlights

Bollywood IT Raids: రైతు ఉద్యమానికి మద్దతిచ్చేవారిని టార్గెట్ చేస్తూ, ఐటీ రైడ్స్ కు దిగుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Bollywood IT Raids: బాలీవుడ్ ప్రముఖుల ఆస్తులపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మొత్తం 28 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.ముంబై, పుణెలో నిర్వహించిన రైడ్స్ కి సంబంధించిన కీలక విషయాలు సేకరించినట్టు ఐటీ అధికారులు తెలిపారు. తాప్సి, అనురాగ్ కశ్యప్ సహా బాలీవుడ్‌లో పన్ను ఎగవేత దారులుగా ఉన్న చాలా సెలబ్రేటీల ఆస్తులపై ఐటీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 300 కోట్ల అనధికార ఆస్తులను ఐటీ అధికారులు గుర్తించారు..

పన్ను ఎగవేత ఆరోపణలతో సోదాలు...

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హీరోయిన్ తాప్సితో పాటుఅనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, మధు మంతెన సహా పలువురు ప్రముఖుల ఇళ్లతో పాటు కార్యలయాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.

ఫాంటమ్ సంస్థ లక్ష్యంగా ఐటీ దాడులు..

అనురాగ్ కశ్యప్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఫాంటమ్ సంస్థ లక్ష్యంగా ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాల్లో అనేక అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ముంబై, పుణె, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 28 ప్రాంతాల్లోని ఇళ్లు, కార్యలయాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. వాస్తవ సినిమా బాక్సాఫీస్ వసూళ్లతో పోల్చితే.. సంస్థ ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. ఈ క్రమంలో దాదాపు 300 కోట్ల తేడా ఉన్నట్లు కనుగొన్నారు. ఇదిలా ఉంటే.. ఉంటే హైదరాబాద్‌లో తాప్సీకి చెందిన 5 కోట్ల నగదు రసీదులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. భారీ మొత్తంలో డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఐటీ సోదాల్లో అధికారులు ఏడు బ్యాంకు లాకర్లను గుర్తించారు..

రాహుల్ గాంధీ స్పందన....

బాలీవుడ్ సెలబ్రేటీల నివాసాల్లో ఐటీ రైడ్స్ జరగడంపై రాహుల్ గాంధీ స్పందించారు. రైతు ఉద్యమానికి మద్దతిచ్చేవారిని టార్గెట్ చేస్తూ, ఐటీ రైడ్స్ కు దిగుతున్నారని ఆరోపించారు. వరుసగా రెండు రోజులపాటు జరిగిన ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదును.. ల్యాప్‌టాప్‌లను, ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories