ఒక దేశం- ఒకే రేషన్ నేటి నుంచే ప్రారంభం

ఒక దేశం- ఒకే రేషన్ నేటి నుంచే ప్రారంభం
x
Ration Card ప్రతీకాత్మక చిత్రం
Highlights

కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ నేషన్ వన్ రేషన్ ప్రారంభించింది.

కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ నేషన్ వన్ రేషన్ ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఒక దేశంల ఒకే రేషన్ కార్డు అమలు చేయాలని గతంలో కేంద్రప్రభత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఈ విధానాన్ని దేశామంటా ప్రారంభంబించారు. అందులో భాగంగా మొదట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలోని 12 రాష్ట్రాల్లో ప్రారంభించింది. అయితే గత సంవత్సరం నవంబర్‌లోనే ఈ విధానాన్ని తెలుగు రాష్ట్రాలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు రేషన్ ఎక్కడైనా తీసుకొవచ్చని గతంలో పేర్కొన్నాయి.

కాగా.. తాజాగా దేశం మొత్తం న్యూ ఇయర్ సందర్భంగా ఈ సదుపాయానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా హరియాణ, రాజస్ధాన్‌, కర్ణాటక,మధ్యప్రదేశ్‌, గోవా, జార్ఖండ్‌, త్రిపుర, గుజరాత్‌, మహారాష్ట్రల్లో ఈ సదుపాయం అమల్లోకి వచ్చింది. రేషన్ లబ్ధిదారులు ఏరాష్ట్రంలో ఉన్న తమ రేషన్‌ వాటాను పొందే వెసులుబాటు ఉంది.

ఒన్‌ నేషన్‌..ఒన్‌ రేషన్‌ 2020 జూన్‌ నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలకు అనుసంధానిస్తారు. ఈ సదుపాయం కింద కొత్త రేషన్ కార్డులు రూపొందించాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో ఒకటో తేదీ జూన్‌ 2020 నుంచి కొత్త ఫార్మా్ట్ లోని రేషన్‌ కార్డులు అందుబాటులోకి వస్తాయి. దేశంలో రేషన్ లబ్ధిదారులకు ఇది అమలులోకి వస్తే ఏ రాష్ట్రంలోనైనా రేషన్ తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories