One Nation One Election: ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ తొలి సమావేశం.. ఈ అంశాలపై చర్చించే అవకాశం

One Nation One Election Committee Meeting Ramnath Kovind Amit Shah Adhir Ranjan Chaudhary
x

One Nation One Election: ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ తొలి సమావేశం.. ఈ అంశాలపై చర్చించే అవకాశం

Highlights

One Nation One Election: ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ప్యానెల్ చర్చించినట్లు సమాచారం

One Nation One Election: వన్‌ నేషన్ వన్ ఎలక్షన్‌‌పై ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం ముగిసింది. కమిటీ ఛైర్మన్ రామ్‌నాథ్‌ కోవింద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్, అమిత్ షా, గులాం నబీ ఆజాద్ పాల్గొన్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది జమిలి ఎన్నికల కమిటీ. జమిలి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాల సేకరణకు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు కూడా ఆహ్వానం అందించాలని నిర్ణయం తీసుకుంది.

దీంతో పాటు లా కమిషన్‌ నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది కమిటీ. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంశంపై ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడానికి ప్రతి ఒక్కరితో ఏయే అంశాలను చర్చించాలనే అంశాలపై ప్రధానంగా కమిటీ చర్చించినట్లు సమాచారం. ఏకకాలంలో ఓటింగ్ అవకాశాలు, హంగ్ అసెంబ్లీ లేదా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడం వంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కూడా ప్యానెల్ చర్చించినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories