Parliament Session: “వన్ నేషన్-వన్ ఎలక్షన్”.. బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం..?

One Nation One Election Bill Likely To Be Tabled During Parliament Special Session
x

Parliament Session: “వన్ నేషన్-వన్ ఎలక్షన్”.. బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం..?

Highlights

Parliament Session: ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేసిన లా కమిషన్‌

Parliament Session: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. వచ్చే నెల 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక సమావేశాల్లో.. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు బిల్లును తెచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో మోడీ సర్కార్ వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. మంత్రాన్ని జపిస్తోంది. ఇప్పుడు కేవలం ఈ బిల్లు కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలని నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఎలక్షన్‌ బిల్లుతో పాటు ఓసీసీ బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనపై లా కమిషన్‌ అధ్యయనం చేసింది.

లోక్ సభ ఎన్నికలతో పాటే అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని ఇప్పటికే మోడీ సర్కార్ పలుసార్లు చెబుతూవచ్చింది. ఎన్నికల వ్యయం బారీగా పెరిగిపోతోందని, అందుకే జమిలి ఎన్నికలే మేలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అవ్వడంతో పాటు ఎన్నికల నిర్వహణ సమయంలో అధికార యంత్రాంగానికి ఎదురవుతున్న సమస్యలను కూడా అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories