Top
logo

Bengal Elections: బెంగాల్‌లో కొనసాగుతున్న నాలుగో విడత ఎన్నికలు

On-going 4th Phase Elections in Bengal
X

ఫైల్ ఇమేజ్ 

Highlights

Bengal Elections: 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. * ఎన్నికలకు ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఎన్నికలకు ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద 78వేల 900 మంది కేంద్ర బలగాలను మోహరించింది. ఉత్తర బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌, అలీపర్దౌర్‌ జిల్లాల్లోనూ దక్షిణ 24 పరగణాలు, హవ్‌డా, హుగ్లీ జిల్లాల్లోనూ ఉన్న ఈ సీట్లున్నాయి. కేంద్ర మంత్రులు బాబుల్‌ సుప్రియో, ఇద్దరు బీజేపీ ఎంపీలు, ఇద్దరు బెంగాల్‌ మంత్రులు పార్థచటర్జీ, అరూప్‌ బిస్వాస్‌ మొదలైన హేమాహేమీల భవిత ఈ నాలుగో దశలో తేలనుంది. 373 మంది అభ్యర్థుల జాతకాలను కోటీ 16 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు.


Web TitleBengal Elections: On-going 4th Phase Elections in Bengal
Next Story