logo
జాతీయం

Budget Meetings: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ఒమిక్రాన్ ప్రభావం

Omicron Effect  on the Budget Meetings of Parliament | National News
X

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ఒమిక్రాన్ ప్రభావం

Highlights

Budget Meetings: వేర్వేరు సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు

Parliament Budget Meeting 2022: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఒమిక్రాన్ ప్రభావంతో పార్లమెంట్ ఉభయ సభలను వేర్వేరుగా సమయాల్లో నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు లోక్‌సభ జరుగుతుంది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ సమర్పణ కోసం లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశమవుతుంది. అనంతరం 2వ తేదీ నుంచి 11 వరకు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోక్‌సభ జరగనుంది.

తొలి రోజు ఉదయం 11 గంటలకు సెంట్రల్‌ హాల్‌ నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ్యులు భౌతిక దూరం పాటించేలా రాజ్యసభ, లోక్‌సభ, సెంట్రల్‌ హాల్‌లలో సీట్లు ఏర్పాటు చేశారురాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కరోనాతో హైదరాబాద్‌లో ఉండటంతో సమయాలపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

Web TitleOmicron Effect on the Budget Meetings of Parliament | National News
Next Story