NVS Posts 2021: నవోదయ పోస్టుల హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష తేది ఖరారు..

NVS Posts 2021 Admit Card Released Exam Date Finalized | Job Notifications 2022
x

NVS Posts 2021: నవోదయ పోస్టుల హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష తేది ఖరారు..

Highlights

NVS Posts 2021: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

NVS Posts 2021: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. చాలామంది నిరుద్యోగులు ఈ పోస్టులకి అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఈ పరీక్షకి సంబంధించిన హాల్‌టికెట్లని నవోదయ విద్యాలయ సమితి (NVS) విడుదల చేసింది. అంతేకాదు పరీక్ష తేదీని కూడా ఖరారు చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో చెక్‌ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-A), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మహిళా స్టాఫ్ నర్స్, స్టెనోగ్రాఫర్ (గ్రూప్ C), అనేక ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు కొనసాగింది. ఇక ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన పరీక్ష మార్చి 9 నుంచి మార్చి 11 వరకు నిర్వహిస్తామని ప్రకటించించారు.

అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inను సందర్శించండి.

2. హోమ్‌పేజ్‌లో కనిపించే 'Link for downloading an E-admit card' అనే లింక్‌పై క్లిక్ చేయండి.

3. సంబంధిత వివరాలతో లాగిన్‌ అవండి.

4. వెంటనే స్క్రీన్‌పై అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది.

5. డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్ ఔట్‌ తీసుకుంటే సరిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories