Top
logo

నర్సుల కొంప ముంచిన టిక్‌టాక్‌ వీడియో

నర్సుల కొంప ముంచిన టిక్‌టాక్‌ వీడియో
Highlights

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుదామనుకున్న వారి ఆలోచన కొంప ముంచింది. సరదాగా చేసిన వీడియో వారి ఉద్యోగానికే ఎసరు...

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుదామనుకున్న వారి ఆలోచన కొంప ముంచింది. సరదాగా చేసిన వీడియో వారి ఉద్యోగానికే ఎసరు పెట్టింది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో నర్సుల ప్రవర్తన శృతిమించింది. నవజాత శిశుకేంద్రంలో అత్యవసర వైద్య సేవలు అందించే ఐసీయూలో నలుగురు నర్సులు టిక్‌ టాక్ వీడీయోలు తీసి అప్‌లోడ్‌ చేశారు. విధుల్లో ఉండగానే అప్పుడే పుట్టిన చిన్నారులకు ట్రీట్‌మెంట్‌ నడుస్తున్న సమయంలోనే ఆ చంటిపిల్లలను ఎత్తుకుని వీడియో తీశారు. హిందీ పాటలపై డ్యాన్సులతో పాటు ఫన్నీ డైలాగులు చెబుతూ సందడి చేశారు.

ఈ సిస్టర్స్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వివాదాస్పదమైంది. మల్కన్‌గిరికి చెందిన చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ నలుగురు నర్సులు నందినీ రే, రూబీ రే, జ్యోతీ రే, తాపసి బిస్వాస్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వివరణ తీసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఐసీయూ లాంటి అత్యవసర వార్డులో విధులు మరిచి ఇలా వీడియోలు చేయడం పట్ల నెటిజన్లు మండి పడుతున్నారు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story


లైవ్ టీవి