ఆధార్ ఉంటేనే హెయిర్‌కట్‌

ఆధార్ ఉంటేనే హెయిర్‌కట్‌
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆధార్ కార్డును సెలూన్లకు కూడా వర్తింపజేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆధార్ కార్డును సెలూన్లకు కూడా వర్తింపజేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై తమిళనాడులోని సెలూన్లలో ఆధార్ కార్డు లేకపోతే క్షవరం చేయరు. సెలూన్లకు వెళ్లే వారు విధిగా తమ వెంట ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిందే. హెయిర్‌కట్‌‌ చేయించుకోవాలి అనుకునే వారు మాస్క్‌తో పాటు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ వెంట తెచ్చుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది.

దీనిపై వివరణ కూడా ఇచ్చింది. సెలూన్ల ద్వారా ఎవరికైనా వైరస్‌ వ్యాప్తి చెందితే ఆ షాపుకు వచ్చిన వారిని గుర్తించడం అధికారులకు సులభం అవుతుందని వివరించింది. ఆధార్‌ వివరాల ద్వారా వ్యక్తులను వెంటనే గుర్తించి వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వ తెలిపింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 23,495 కరోనా కేసులు నమోదు కాగా.. 10,141 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో 184 మంది మరణించారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories