రూ.2 వేల నోటు ఇక బంద్‌?

రూ.2 వేల నోటు ఇక బంద్‌?
x
Highlights

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి చెందిన ఏటీఎంల నుంచి ఇకపై రూ. 2,000 నోటు రాదు. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సూచన మేరకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి చెందిన ఏటీఎంల నుంచి ఇకపై రూ. 2,000 నోటు రాదు. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సూచన మేరకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే దాదాపు అన్ని ఎస్బీఐ ఏటీఎంల్లో రూ. 2 వేల నోట్లను ఉంచే క్యాసెట్లను తొలగించినట్టు సమాచారం. అంతేకాదు త్వరలోనే రూ.500 నోటును కూడా ఏటీఎంల్లో ఆపేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేవలం రూ.100, రూ. 200 నోట్లతోనే ఏటీఎం లావాదేవీలు జరిగేలా చూసేందుకు ఎస్‌బీఐ యోచిస్తోంది. చిన్న నోట్ల కారణంగా ఏటీఎంలలో ఉంచే నగదు పరిమితి తగ్గే అవకాశం ఉండడంతో ఆ మేరకు లావాదేవీల పరిమితిని పెంచాలని యోచిస్తున్నట్టు సమాచారం. మెట్రో నగరాల్లో 10 సార్లు, ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఏటీఎం నుంచి నగదు తీసుకునే వెసులుబాటును బ్యాంకు అధికారులు కల్పించనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories