రైతు సంఘం నేత దర్శన్‌పాల్ సింగ్‌కు నోటీసులు

Notices to farmer association leader Darshanpal Singh
x

Darshanpal Singh (file image)

Highlights

* కిసాన్ ట్రాక్టర్ పరేడ్ హింసలో విచారణ కోసం పిలుపు * పంజాబీ సింగర్, యాక్టర్ దీప్ సిద్ధూపైనా ఎఫ్ఐఆర్ నమోదు * ఎర్రకోట ముట్టడి కేసులో విచారణ జరపనున్న పోలీసులు

ఢిల్లీలో చెలరేగిన హింసలో ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే 200మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రైతు సంఘం నేత దర్శన్‌పాల్ సింగ్‌కు నోటీసులు అందించారు. కిసాన్ ట్రాక్టర్ పరేడ్ హింస నేపథ్యంలో విచారణ కోసం రావాలంటూ పిలుపు ఇచ్చారు. పలువురు రైతు నేతలకు కూడా విచారణ హజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు 22 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీపై ఎందుకు చర్యలు తీసుకొవద్దో చెప్పాలని పోలీసులు ప్రశ్నించారు.

పంజాబీ సింగర్, యాక్టర్ దీప్ సిద్ధూపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎర్రకోట ముట్టడి కేసులో పోలీసులు విచారణ జరపనున్నారు. ఎర్రకోటపై దాడి చేయడాన్ని దీప్‌ సిద్ధూ సమర్ధించుకున్నారు.. దాడి చేయడంలో ఎలాంటి తప్పులేదని దీప్ సిద్ధూ సమర్ధించుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories