Indian Railway: రైల్వే ప్రయాణికులకి గమనిక.. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌తో ఇలా కూడా చేయొచ్చు..!

Note for Railway Passengers you can Travel by Train with a Platform Ticket | Live News Today
x

Indian Railway: రైల్వే ప్రయాణికులకి గమనిక.. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌తో ఇలా కూడా చేయొచ్చు..!

Highlights

Indian Railway: ప్రయాణికుల కోసం రైల్వే కొత్త కొత్త సౌకర్యాలని ప్రవేశపెడుతోంది...

Indian Railway: ప్రయాణికుల కోసం రైల్వే కొత్త కొత్త సౌకర్యాలని ప్రవేశపెడుతోంది. అయితే ఇప్పటికి కొంతమంది ప్రయాణికులకు రైల్వేకి సంబంధించి కొన్ని నియమాలు తెలియవు. కొన్నిసార్లు ప్రయాణం చేసేటప్పుడు చెడ్డ పరిస్థితులు ఎదురవుతాయి. ఆలస్యం కారణంగా టికెట్ తీసుకోకపోవచ్చు. అప్పుడు భయపడనవసరం లేదు. రిజర్వేషన్ నియమాలు లేకుండా రైలులో ప్రయాణించవచ్చు. అయితే ఒక పనిచేయాల్సి ఉంటుంది.

దాని గురించి తెలుసుకుందాం. మీకు రిజర్వేషన్ లేకుంటే మీరు ప్రయాణించాలనుకుంటే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను తీసుకొని రైలు ఎక్కవచ్చు. కానీ తర్వాత మీరు టీసీ వద్దకు వెళ్లి టికెట్ తయారు చేసుకోవచ్చు. ఈ రూల్ రైల్వేలలో ఉంది. అయితే ఇందుకోసం ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ తీసుకుని వెంటనే టీటీఈని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు TTE మీ గమ్యస్థానం వరకు టిక్కెట్‌ను సృష్టిస్తారు.

రైలులో సీటు ఖాళీగా లేని సందర్భాలు చాలా ఉంటాయి. ఈ పరిస్థితిలో TTE మీకు రిజర్వ్ సీటు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. కానీ ప్రయాణం ఆపలేరు. మీకు రైలులో రిజర్వేషన్ లేకపోతే ప్రయాణీకుల నుంచి రూ. 250 అపరాధ రుసుముతో పాటు, ప్రయాణానికి సంబంధించిన మొత్తం ఛార్జీని చెల్లించి టికెట్ పొందాలి. సామాన్య ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేలు ఇలాంటి అనేక నియమాలను రూపొందించాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

భారతీయ రైల్వే ఇప్పుడు టిక్కెట్ల బుకింగ్ నిబంధనలను కూడా మార్చింది. ఇప్పుడు మీరు మునుపటి కంటే తక్కువ సమయంలో టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. రైల్వే నిర్ణయం ప్రకారం.. ఇప్పుడు టికెట్ బుకింగ్ సమయంలో గమ్యస్థానం చిరునామా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే గతంలో కరోనా వల్ల IRCTC వెబ్‌సైట్, యాప్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారు గమ్యస్థాన చిరునామాను నమోదు చేయడం తప్పనిసరి చేశారు. ఇప్పుడు కోవిడ్-19 కేసులు తగ్గడంతో ఆ నిబంధన ఎత్తివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories