Kerala: కేరళలో కొత్తగా నోరో వైరస్...19 మంది విద్యార్థులకు పాజిటివ్..

Noro Virus Is Spreading Its Claws In The Country
x

Nora Virus: చిన్నారులకు సోకుతున్న నోరో.. కేరళలో బయటపడిన వైరస్ లక్షణాలు

Highlights

Nora Virus: ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన

Nora Virus: దేశంలో నోరో వైరస్ పంజా విసురుతోంది కేరళలో కొత్తగా నోరో వైరస్ లక్షణాలు కలిగిన విద్యార్థులను అధికారులు గుర్తించారు. కక్కనాడ్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలులో చదివే 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో విద్యార్థుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేయించారు. కొంతమంది విద్యార్థులకు నోరో వైరస్ సోకినట్టుగా గుర్తించారు. దీంతో అక్కడి ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు.

కేరళలో 19 మంది చిన్నారులకు నోరో వైరస్ పాజిటివ్ అని తేలడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. డయేరియా, వాంతులు, స్వల్ప జ్వరం, తలనొప్పితో పిల్లలు బాధపడుతున్నారంటే నోరో వైరస్ సోకినట్లేనని వైద్యులు చెబుతున్నారు. పాఠశాల తరగతి గదితో పాటు టాయ్‌లెట్లలో ఇన్ఫెక్షన్ సోకి కలుషితమైన నీరు, ఆహారంవల్ల నోరో వైరస్ వ్యాప్తి చెందుతోందని వైద్యాధికారులు అంటున్నారు. ఈ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories