కరోనా కలకలం.. స్కూల్ బంద్

కరోనా కలకలం.. స్కూల్ బంద్
x
Noida school undergoes sanitisation/Picture for representational image
Highlights

ఢిల్లీకి చెందిన వ్యక్తికి కరోనా సోకిన వార్తల విషయంలో దిగ్భ్రాంతి గొలిపే సంఘటన వెలుగు చూసింది.

ఢిల్లీకి చెందిన వ్యక్తికి కరోనా సోకిన వార్తల విషయంలో దిగ్భ్రాంతి గొలిపే సంఘటన వెలుగు చూసింది. మయూర్ విహార్‌కు చెందిన వ్యక్తికి కరోనా వ్యాధి నిర్ధారణ కాక ముందే శుక్రవారం నోయిడాలో పుట్టిన రోజు వేడులకు చేసుకున్నాడని తెలుస్తోంది. ఆ పార్టీలో అతని స్నేహితులు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు కూడా పాల్గొన్నారని సమాచారం.

కరోనా పేషెంట్‌తో ఎవరితో కలిశాడు అనే దానిపై వివరాలు సేకరిచారు. అతను కలిసిన వారితో ఆరోగ్య శాఖ టచ్‌లో ఉంది. వారందరిని 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని తెలిపినట్లు సమాచారం. అలాగే నోయిడాలోని స్కూల్‌లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించింది. అతడు కలిసిన వారిలో ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదు.

ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన అతనికి కరోనా వైరస్ సోకినట్లు తెలియటంతో.. అతని పిల్లలు చదువుతున్న పాఠశాలకు 3 రోజులపాటు సెలవు ప్రకటించారు. పరీక్షలను వాయిదా వేశారు. ఆ స్కూల్‌తో సంబంధం ఉన్న 40 మందికి పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఇటలీ వెళ్లొచ్చారు. అతను ఆస్ట్రియా మీదుగా భారత్ చేరడంతో.. ఢిల్లీ విమానాశ్రయంలో అతడికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించలేదు. అతడు వచ్చిన ఎయిరిండియా విమాన సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడికి, ఢిల్లీకి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకినట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories