చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
x
Highlights

-ముంబైలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే... -సంతోషం వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు -అక్టోబర్ 21కి విచారణను వాయిదా

ముంబైలోని ఆరే ఏరియాలో ఒకప్పుడు అడవి ఉండేదన్న సుప్రీంకోర్టు ప్రస్తుతం ఆ ప్రాంతం ఎలా ఉందో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటివరకూ ఎన్ని చెట్లను నరికివేశారో రిపోర్టులో చెప్పాలని కోరింది. ముంబై మెట్రో నిర్వాహకులు తిరిగి చెట్లను పెంచే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ఆరే ఏరియాలో మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జరుగుతున్న చెట్ల నరికివేతను అడ్డుకుంటున్న పర్యావరణ వేత్తలు, ఆందోళనకారులకు ఊరటనిచ్చే ఉత్తర్వులు సుప్రీంకోర్టు నుంచీ వచ్చాయి. శనివారం నుంచీ చెట్ల నరికివేత సాగుతుండగా సుప్రీంకోర్టు తాజాగా చెట్ల నరికివేతపై స్టే విధించింది. ఈ అంశంపై ప్రత్యేకంగా ఏర్పాటైన ద్విసభ్య ధర్మాసనం తన ఉత్తర్వులు ఇస్తూ అక్టోబర్ 21కి విచారణను వాయిదా వేసింది. ఆరే కాలనీలో అటవి ప్రాతం ఉందని చెట్ల నరికివేత వలన పర్యావరణానికి హాని కలుగుతోందని ఎంజీవోలు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టి వేసింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచే ముంబాయి మెట్రో రైల్ కార్పొరేషన్ చెట్ల తొలిగింపును మొదలు పెట్టింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories