సుప్రీంలో చిదంబరానికి చుక్కెదురు..ఇక అరెస్టే..

సుప్రీంలో చిదంబరానికి చుక్కెదురు..ఇక అరెస్టే..
x
Highlights

కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి చిదంబరంపై లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన చిదంబరం కోసం గాలిస్తున్నారు. ఆయన దేశం దాటే అవకాశాలుండటంతో ముందస్తు జాగ్రత్తగా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి చిదంబరంపై లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన చిదంబరం కోసం గాలిస్తున్నారు. ఆయన దేశం దాటే అవకాశాలుండటంతో ముందస్తు జాగ్రత్తగా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. మరోవైపు బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చిదంబరానికి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముందుకు వచ్చింది. అయితే దీనిపై తాను ఉత్తర్వులు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. తక్షణ విచారణ కోసం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి ముందుకు పంపించారు. దీంతో చిదంబరానికి అరెస్టు నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్కామ్క్ కు సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో చిదంబరం దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ఆయన వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా ఆయనకు ఉపశమనం దొరకలేదు. పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో చిదంబరం తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, వివేక్‌ టంకా ఇవాళ ప్రత్యేక లీవ్‌ పిటిషన్ దాఖలు చేయగా తక్షణ విచారణ చేసేందుకు జస్టిస్‌ రమణ నిరాకరించారు. మరోవైపు తెల్లవారుజామున సీబీఐ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ కనిపించలేదు. ఢిల్లీ హైకోర్టులో తీర్పు వెలువడినప్పటి నుంచి సీబీఐ బృందం మూడుసార్లు ఆయన ఇంటికి వచ్చారు. తాజా పరిణామాలతో చిదంబరం ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories