అక్టోబర్ 16 నుండి ఉచిత కరోనావైరస్ పరీక్షలు లేవు..

అక్టోబర్ 16 నుండి ఉచిత కరోనావైరస్ పరీక్షలు లేవు..
x
Highlights

రాష్ట్రంలో ఉచిత కరోనావైరస్ పరీక్షా సదుపాయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 16 నుండి, ప్రజలు కరోనావైరస్ పరీక్షలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది..

రాష్ట్రంలో ఉచిత కరోనావైరస్ పరీక్షా సదుపాయాన్ని ఉపసంహరించుకోవాలని మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 16 నుండి, మేఘాలయ ప్రజలు కరోనావైరస్ పరీక్షలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

ఈ విషయాన్నీ మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ వెల్లడించారు. అక్టోబర్ 16 నుండి కోవిడ్ -19 పరీక్షలకు వెళ్లాలనుకునే వారు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇది శాశ్వత నివాసితులకు మరియు వ్యాపార ప్రయోజనాల కోసం రాష్ట్రంలోకి వచ్చిన వారందరికీ వర్తిస్తుందని చెప్పారు. కరోనా పరీక్షలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎక్కువ సహాయం అందడం లేదని.. ఐసిఎంఆర్ కూడా ఇదే విషయంపై ఉత్తర్వు కూడా ఇటీవల జారీ చేసింది అని చెప్పారు.. ఈ నేపథ్యంలో ఆ ఖర్చును భరించే స్థోమత రాష్ట్రానికి లేదని.. అందువల్ల కోవిడ్ -19

పరీక్షల కోసం ప్రజలు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అక్టోబర్ 16 నుండి రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కు 500 రూపాయలు అందరికీ తప్పనిసరి చేసినట్టు ఆయన చెప్పారు. ఇక ట్రూనాట్, సిబిఎనాట్ లేదా ఆర్టిపిసిఆర్ పరీక్ష కోసం రూ .3,200 గా నిర్ణయించినట్టు తెలిపారు, అయితే బిపిఎల్ కేటగిరీ ప్రజలకు మాత్రం 72 గంటలలోపు ట్రూనాట్, సిబిఎన్ఎటి లేదా ఆర్టిపిసిఆర్ పరీక్షలు చేసినట్లు ధృవీకరణ పత్రాలు ఇస్తే మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

కాగా మేఘాలయలో ఇప్పటివరకు 7,037 పాజిటివ్ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, వాటిలో 2,371 యాక్టీవ్ కేసులు ఉన్నాయి, ఇప్పటివరకూ 4606 మంది కోలుకున్నారు.. 60 మంది మరణించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో తాజాగా 270 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories