టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు నిర్వహించం : హెచ్‌ఆర్‌డీ

టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు నిర్వహించం : హెచ్‌ఆర్‌డీ
x
Highlights

దేశంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న కరోనా వైరస్ సంక్రమణ ముప్పు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మూడవ సారి లాక్డౌన్ వ్యవధిని మే 17 న పొడిగించిన సంగతి తెలిసిందే.

దేశంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న కరోనా వైరస్ సంక్రమణ ముప్పు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మూడవ సారి లాక్డౌన్ వ్యవధిని మే 17 న పొడిగించిన సంగతి తెలిసిందే.. కొన్నింటికి లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది. అయితే పాఠశాలలు , కళాశాలలకు మాత్రం సడలింపులు ఇవ్వలేదు. ఈ తరుణంలో ఈ ఏడాది జరగవలసిన 10 పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షల నిర్వహణపై కీలక సమాచారం వెలువడింది.

తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మినహా కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి పెండింగ్‌లో ఉన్న పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించబోమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. తూర్పు ఢిల్లీలో రెండు నెలల కిందట caa అల్లర్ల కారణంగా వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షలకు ముందు వారికి పదియాజులు ప్రేపరషన్ హాలీడేస్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories