ఉప ఎన్నికలకు పనిచేయను: ప్రశాంత్‌ కిషోర్‌ కీలక నిర్ణయం

ఉప ఎన్నికలకు పనిచేయను: ప్రశాంత్‌ కిషోర్‌ కీలక నిర్ణయం
x
prashant kishor (file photo)
Highlights

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాజ‌కీయ‌పార్టీల‌కు ప్ర‌శాంత్ కిశోర్‌.. పొలిటిక్ స్ట్రాట‌జిస్టుగా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే.

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాజ‌కీయ‌పార్టీల‌కు ప్ర‌శాంత్ కిశోర్‌.. పొలిటిక్ స్ట్రాట‌జిస్టుగా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైఎస్సార్సీపీ పార్టీకి కూడా పీకే సేవ‌లందించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మధ్యప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రశాంత్‌ కిషోర్‌ను కోరినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను ప్రశాంత్ కిషోర్ తిరస్కరించారు.. తనకు మధ్యప్రదేశ్ లో ప్రచార బాధ్యతలను అప్పగించాలని, అలాగే పార్టీని గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌ తోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా అడిగారని. కాని తాను దానికి అంగీకరించలేదని.

ముక్కలు ముక్కలుగా జరిగే ఎన్నికల్లో నేను కాంగ్రెస్ కోసం పనిచేయలేనని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేసినట్టు చెప్పారు. కాగా జ్యోతిరాదిత్య సింథియా తన వర్గం ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. కాగా 2014 ఎన్నికల్లో తొలిసారి ప్రశాంత్‌ కిషోర్‌ బీజేపీ విజయం కోసం పని చేశారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories