బీహార్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో సర్వే..

బీహార్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో సర్వే..
x
Highlights

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తరువాత భారతదేశంలో జరుగుతున్న మొదటి ఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబర్ 28 మరియు నవంబర్ 7 మధ్య జరగనున్న ఎన్నికలు..

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తరువాత భారతదేశంలో జరుగుతున్న మొదటి ఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబర్ 28 మరియు నవంబర్ 7 మధ్య జరగనున్న ఎన్నికలు.. అధికార ఎన్డీఏ మరియు ప్రధాన ప్రతిపక్ష మహాగడ్‌బందన్ మధ్య ప్రత్యక్ష యుద్ధంగా మారాయి. ఈసారి మళ్ళీ నితీష్ మళ్ళీ సీఎం అవుతాడా? బీజేపీ పట్టు సాధిస్తుందా..? తేజశ్వి యాదవ్ కొత్త స్టార్‌గా ఎదగగలరా? అనే ప్రశ్నల సమాధానాల కోసం నవంబర్ 10 వరకు వేచి ఉండాల్సి ఉండగా, లోక్నిటీ-సిఎస్‌డిఎస్ సంస్థ చేసిన బీహార్ ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది. అక్టోబర్ 10 మరియు 17 మధ్య నిర్వహించిన ప్రీ-పోల్ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సర్వేలో మహాగడ్‌బందన్ పై ఎన్‌డిఎ 6 శాతం లీడ్ లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహాగడ్‌బందన్ అంచనా వేసిన 32 శాతం వాటాతో పోల్చితే ఎన్డీఏ 38 శాతం ఓట్లను సాధిస్తుందని సర్వే అంచనా చేసింది.

మొత్తంమీద, ఎన్డీఏ పార్టీల ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికల నుండి ఐదు శాతం తగ్గే అవకాశం ఉండగా, మహాగడ్‌బందన్ ఓట్లు 3.5 శాతం పెరిగే అవకాశం ఉంది. 243 అసెంబ్లీ సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు.. లోక్నిటి-సిఎస్‌డిఎస్ సర్వేలో ఎన్డీఏ 133-143 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.. అలాగే మహాగడ్‌బందన్ 88-98 స్థానాల్లో, ఎల్‌జెపి రెండు నుంచి ఆరు స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకి మెరుగైన స్థానాలు లభిస్తాయని.. చాలా చోట్ల ఎల్‌జెపి అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో జెడి (యు) అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తారని సర్వే అంచనా వేసింది. అయినా కూడా ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories