బీహార్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సీఎం నితీశ్ కుమార్

బీహార్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సీఎం నితీశ్ కుమార్
x
Highlights

బిహార్ పాలిటిక్స్ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.

బిహార్ పాలిటిక్స్ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ పార్టీ అధ్యక్షడు నితీశ్ కుమార్ ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు రామచంద్ర ప్రసాద్ సింగ్ (ఆర్సీపీ సింగ్) అధ్యక్షడిగా ఎన్నికయ్యారు. ఇవాళ పాట్నాలో జరిగిన జేడీయూ కార్యవర్గ భేటీలో రామచంద్ర ప్రసాద్ సింగ్ (ఆర్సీపీ సింగ్ )పేరును సీఎం నితీశ్ కుమారే ప్రతిపాదించారు. దీంతో ఛీఫ్ పదవి ఏకగ్రీవంగా ఆమోదం జరిగింది.

ఆర్సీపీ సింగ్ కుఅందుకుంటున్న నితీశ్ తో చాలాకాలంగా మంచి అనుబంధం ఉంది. గతంలో నితీశ్ కుమార్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆర్సీపీ సింగ్ వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించారు. నితీశ్ బీహార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆర్సీపీ సింగ్ నితీశ్ కు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆపై రాజకీయాల్లోకి వచ్చిన ఆయన జేడీయూ తరఫున రాజ్యసభకు వెళ్లారు. రామచంద్ర ప్రసాద్ సింగ్ (ఆర్సీపీ సింగ్) జేడీయూ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. నితీశ్ కుమార్ కు అత్యంత నమ్మకంగా ఉన్న ఆయనను అధ్యక్ష పదవి వరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories