Nitin Gadkari: హైడ్రోజన్‌ బస్సులో టెస్ట్‌ డ్రైవ్‌కు వెళ్లిన నితిన్‌ గడ్కరీ

Nitin Gadkari Takes A Test Drive In Hydrogen Bus In Prague
x

Nitin Gadkari: హైడ్రోజన్‌ బస్సులో టెస్ట్‌ డ్రైవ్‌కు వెళ్లిన నితిన్‌ గడ్కరీ

Highlights

Nitin Gadkari: మెరుగైన రవాణా ప్రత్యామ్నాయాలుగా ఈ బస్సులను అభివర్ణించిన గడ్కరీ

Nitin Gadkari: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ యూరప్ దేశం చెక్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటోలు, వీడియోను పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఓవర్ హెడ్ పవర్ ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సులో టెస్ట్ రైడ్‌లో పాల్గొన్నట్టు వెల్లడించారు. ప్రేగ్ నగరంలో ఈ టెస్ట్ రైడ్ చేపట్టారని వివరించారు. ఈ బస్సు పొడవు 24 మీటర్లు. చెక్ రిపబ్లిక్ ఆటోమొబైల్ దిగ్గజం స్కొడా ఈ ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సును అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ బస్సు ప్రయోగాత్మక దశలో ఉందని గడ్కరీ తెలిపారు.

ఒక్కసారి ఇది రోడ్డెక్కితే, మెట్రో నగరాల్లో రవాణా ఎంతో చవకగా మారుతుందని తెలిపారు. మెట్రో రైళ్ల మాదిరిగా ఈ బస్సులకు ప్రత్యేక ట్రాక్ లైన్లు ఉంటాయని, ఇవి నగరాల్లో తక్కువ ఖర్చుతో మెరుగైన రవాణా ప్రత్యామ్నాయాలుగా మారతాయని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి బస్సులతో ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను మరింత విస్తరించవచ్చని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories