మహారాష్ట్రలో ఏం జరుగుతుందో తెలియదు, కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు

nitin gadkari
x
nitin gadkari
Highlights

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం క్రికెట్‌...

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం క్రికెట్‌ ఆటాలాంటిదని ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఆటలో ఫలితం ఎప్పుడు ఏలా ఉంటుందో చెప్పలేమని ఎవరూ ఊహించలేరని తేల్చి చెప్పారు. గురువారం రాత్రి మహరాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర రాజకీయాలపై తాను జోక్యం చేసుకోవడం లేదని ఢిల్లీ రాజకీయాలపై తాను దృష్టి సారించామని తెలిపారు. మహారాష‌్ట్రలో మలుపు తీరుగుతుందో తెలిదని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏదీ వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవని తెలిపారు. అలాగే బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని పెర్కోన్నారు. ఫలితాల తర్వాత శివసేన కొన్ని డిమాండ్లు ఉంచిందని వాటిని బీజేపీ అంగీకరించదని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో సీఎం అభ్యర్థి ఫడ్నవీస్ అని చెప్పామని స్పష్టం చేశారు. ఫలితాల అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.

మహారాష్ట్రలో సీఎం పీటంపై చర్చలు కొలిక్కి వస్తున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఐదేళ్ల పాటు సీఎం పదవిని శివసేనకు ఇచ్చేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ అంగీకరించాయి. ఎన్సీపీకి మండలి ఛైర్మన్‌, ఒక డిప్యూటీ సీఎం, 14 మంత్రి పదవులు... ఇక కాంగ్రెస్‌కు స్పీకర్‌, ఒక డిప్యూటీ సీఎం, 12 మంత్రి పదవులు ఇచ్చేందుకు ఉమ్మడి ప్రణాళికను ఖరారు చేశాయి మూడు పార్టీలు.

మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 , ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఫలితాల తర్వాత రాజకీయాలు ఒక్కసారిగి మారాయి. గవర్నర్ ఆహ్వానించిన ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో ప్రస్థుతం అక్కడ రాష్ట్రపతి పాలనను కేంద్రం అమలు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories