భారత బోల్ట్ శ్రీనివాస గౌడను మించిన మరో కంబాల రన్నర్

భారత బోల్ట్ శ్రీనివాస గౌడను మించిన మరో కంబాల రన్నర్
x
నిషాంత్ శెట్టి ఫైల్ ఫోటో
Highlights

భారత్ బోల్ట్ రికార్డును మరో బోల్ట్ నిషాంత్ శెట్టి తిరగరాశాడు.

కంబాల రన్నర్ శ్రీనివాస గౌడ గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా మారు మోగుతున్న పేరు. భారత్ ఉసెన్ బోల్ట్ అంటూ సోషల్ మీడియా కీర్తించిన ఓ మాములు భవన నిర్మాణ కార్మికుడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుతోనే స్వయంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రయల్స్‌కు హాజరు కావాలని పిలుపించుకున్న ఘనుడు. అలాంటి శ్రీనివాస గౌడను తలదిన్నే మరో కంబాల్ రన్నర్ వెలుగులోకి వచ్చాడు. అతను పేరు నిషాంత్ శెట్టి.

ఫిబ్రవరి 16న జరిగిన ఓ కంబాల పోటీల్లో అతను తన జోడెద్దులతో 143 మీటర్లను 13.68 సెకన్లలోనే పూర్తి చేశాడు. ఈ లెక్కన 100 మీటర్లను 9.51 సెకన్లలోనే పూర్తి చేసినట్టు. అంటే శ్రీనివాస్ గౌడ కన్న ఇది 0.04 సెకన్లు తక్కువ. పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్ కన్నా 0.07 సెకన్లు తక్కువ. కర్ణాటకలోని బజ్‌గోలి జోగిబెట్టుకు చెందిన నిషాంత్ షెట్టి.. వెనూర్ వేదికగా జరిగిన సూర్య-చంద్ర జోడుకరే కంబాల పోటీల్లో ఈ నయా రికార్డు సృష్టించాడు.

కాగా.. కంబాల అనేది దక్షిణ కన్నడ, ఉడుపి, తుళునాడు తీర ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ. కంబాల ఆటలో ఎద్దుల పోటీదారుడు బురద నీటిలో పరుగెడ్తాడు. ఎవరైతే ఎద్దులను వేగంగా పరుగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతగా నిలుస్తారు. కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ క్రీడా ఎప్పటినుంచో ఉంది.

జమైకా పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్ ఆల్‌టైమ్ 100 మీటర్ల పరుగు రికార్డు 9.58 సెకన్లను బ్రేక్ చేయడంతో శ్రీనివాస గౌడను యావత్ భారతం కీర్తించింది. కంబాల పోటీలో అతను తన దున్నలతో 142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ లెక్కన 100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస్ 9.55 సెకన్లలో పూర్తి చేసి భారత్ బోల్ట్ అంటూ ప్రశంసలు అందుకున్నాడు.

దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన ఈ రేసర్‌ శ్రీనివాస్‌ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తి.. ఉసేన్‌ బోల్ట్‌ రికార్డును గుర్తు చేశాడు. 142.50 మీటర్ల దూరాన్ని 100 మీటర్లకు లెక్కించినపుడు కన్నడ యువకుడు జైమైకా చిరుత కన్నా 0.03 సెకండ్లు ముందంజలో ఉన్నాడు. కుర్రాడి పరుగు ఎలా ఉంటుందంటే ఏకంగా చిరుతనే తలపించింది. రెండు దున్నపోతులతో పాటు బురదమయమైన పంట పొలాల్లో పరుగెత్తాడు. కంబాల ఆటలో చిరుత వేగంతో గెలిచిన లక్ష రూపాయాల బహుమతిని కూడా కొట్టేశాడు. ఈ బురద పరుగు పందెంలో శ్రీనివాస గౌడ.. బోల్ట్‌ కన్నా వేగంగా పరెగెత్తుతున్నాడని నెటిజన్లు ప్రశంసల వర్షం కురుస్తున్నారు. అఫీషియల్ కాకపోయినా, ఏ ఒలంపిక్స్‌ గేమ్స్‌లో పాల్గొని ఉంటే... శ్రీనివాస గౌడ మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించేవాడని కామెంట్లు వస్తున్నారు.

బోల్ట్‌ను మించిన వేగంతో పరుగెత్తి... అందరిదృష్టిని ఆకర్షించిన శ్రీనివాసగౌడపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పరుగులవీరుడికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఒలంపిక్స్‌కు పంపించాలంటూ పలువురు సూచిస్తున్నారు. రీసెంట్‌గా పారిశ్రామివేత్త ఆనంద్‌ మహీంద్రా ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరణ్‌ రిజు దృష్టికి తీసుకెళ్లారు. శ్రీనివాస్‌కు బంగారు పతకం కూడా ఇవ్వాలన్నారు. ఇటు బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి కూడా శ్రీనివాస్‌ ప్రతిభకు మురిసిపోయారు. ప్రతిభగల వ్యక్తులను వదులుకోవద్దన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories