NISAR satellite: భూమిని స్కాన్ చేసే ‘నిసార్’ శాటిలైట్‌.. జూలై 30న శ్రీహరికోట నుంచి ప్రయోగం

NISAR satellite
x

NISAR satellite: భూమిని స్కాన్ చేసే ‘నిసార్’ శాటిలైట్‌.. జూలై 30న శ్రీహరికోట నుంచి ప్రయోగం

Highlights

NISAR satellite: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముఖ్యమైన అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి అభివృద్ధి చేసిన నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ మిషన్‌ (నిసార్‌) శాటిలైట్‌ను జూలై 30న నింగిలోకి పంపనుంది.

NISAR: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముఖ్యమైన అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి అభివృద్ధి చేసిన నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ మిషన్‌ (నిసార్‌) శాటిలైట్‌ను జూలై 30న నింగిలోకి పంపనుంది.

ఈ శాటిలైట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాన్ని సుమారు 743 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో, 98.40 డిగ్రీల వంపుతో ప్రవేశపెట్టనున్నట్టు ఇస్రో అధికారికంగా వెల్లడించింది.

ప్రపంచంలోనే మొట్టమొదటి భూమి స్కానింగ్ శాటిలైట్‌

నిసార్ ఉపగ్రహం భూమి ఉపరితలాన్ని అత్యంత ఖచ్చితంగా అధ్యయనం చేయగలగిన సామర్థ్యం కలిగిన ప్రథమ శాటిలైట్‌గా గుర్తింపు పొందుతోంది. ఇందులో రెండు ప్రత్యేక రకమైన బ్యాండ్‌ల రాడార్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి దట్టమైన అడవుల్లోనూ పనిచేసి, అక్కడి భూమి పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలవు.

ఇస్రో ప్రకారం, నిసార్ శాటిలైట్ ‘స్వీప్‌సార్’ టెక్నాలజీని అధిక రిజల్యూషన్‌తో ఉపయోగించనున్న మొట్టమొదటి శాటిలైట్. భూమిని స్కాన్ చేస్తూ, ప్రతి 12 రోజులకు ఒక్కసారి ప్రపంచ భూపటాన్ని తిరిగి చిత్రీకరించి, వాతావరణ మార్పులపై విలువైన డేటాను పంపించనుంది.

వాతావరణ పరిశోధన, ప్రకృతి వైపరీత్యాల పట్ల ముందస్తు హెచ్చరికలకు ఉపయోగం

ఈ శాటిలైట్ ద్వారా భూమిపై జరిగే ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, గ్లేసియర్ల కరుగుదల, అటవీ విస్తరణలపై శాస్త్రీయ పరిశీలన జరగనుంది. వాతావరణ మార్పులు, భూమి ఖండాల కదలికలపై అధ్యయనానికి ఇది కీలకంగా మారనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories