బ్రేకింగ్ : లాక్‌డౌన్‌ వేళ కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ

బ్రేకింగ్ : లాక్‌డౌన్‌ వేళ కేంద్రం భారీ ఆర్థిక  ప్యాకేజీ
x
Highlights

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుండడంతో, ముఖ్యంగా రోజువారీ కూలీలను , చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రం భారీ ఉద్దీపన...

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుండడంతో, ముఖ్యంగా రోజువారీ కూలీలను , చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఈ విషయాన్ని పేర్కొంటూ.. లక్షా 70 వేల కోట్లతో భారీ ఎకనామిక్ ప్యాకేజీని అమలు చేయబోతున్నట్టు వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందనీ.. పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని నిర్మల ప్రకటించారు.

ఉపశమన చర్యలు

కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సహాయం

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సహాయం

కరోనా కేసుల్లో పని చేస్తున్న ఆరోగ్య సహాయకులకు 50 లక్షల ఆరోగ్య భీమా

3 నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్‌ ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్‌ యోజన్‌ ద్వారా

మరో 5 కేజీల బియ్యం లేదా గోధుమలుఇప్పటికే ఇస్తున్న 5 కేజీలకు అదనం

వీటితో పాటు కేజీ పప్పు సరఫరా చేస్తాం

పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ

పీఎం కిసాన్‌ కింద ఇప్పటికే రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తున్నాం

మొదటి విడతగా రూ.2వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ

ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం రూ.202కు పెంపు

వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రెండు విడతలుగా రూ.వెయ్యి

జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు

ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు

డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు

డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు

ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుంది

90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తింపు

తమ పీఎఫ్‌ డబ్బు నుంచి 75శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories