సలహాలు ఇవ్వడానికి ఇందిరా ఎవరు .. ? నిర్భయ తల్లి ఫైర్‌

సలహాలు ఇవ్వడానికి ఇందిరా ఎవరు .. ? నిర్భయ తల్లి ఫైర్‌
x
Highlights

ఇందిరా జైసింగ్ లాంటి వ్యక్తుల వల్లే....అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదు

కొన్నేళ్ల కిందట దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడిన కిరాతకులకు మరణశిక్ష కోసం తీవ్రంగా పోరాడడం ద్వారా నిర్భయ తల్లి ఆశాదేవి ఎంతో గుర్తింపు సంపాదించారు. మరికొన్నిరోజుల్లో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు పోరాడుతున్నారు.

ఈ నేపథ్యంలో సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. నిర్భయ తల్లి ఆవేదన అర్ధం చేసుకోగలను , కానీ రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీని సోనియా గాంధీ క్షమించారని, ఆమెకు ఉరిశిక్ష పడాలని కోరుకోలేదని గుర్తు చేశారు. సోనియాను చూసి నిర్భయ తల్లిని కోరుతున్నానని అన్నారు. ఆమెకు మద్దతు ఉంటుందని, ఉరి శిక్షకు మాత్రమే వ్యతిరేకం అని ఇందిరా జైసింగ్ పలు వ్యాఖ్యలు చేశారు .

నిర్భయ దోషులను క్షమించి వదిలేయాలన్న సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ వ్యాఖ్యలపై నిర్భయ తల్లి ఆశాజ్యోతి సీరియస్‌ ఆయ్యారు . నాకు సలహాలు ఇవ్వడానికి ఇందిరా ఎవరు అని ప్రశ్నించిన ఆమె..నిర్భయ దోషులను ఉరి తీయాలని యావత్‌ భారత్‌ కోరుకుంటుందన్నారు. ఇందిరా జైసింగ్ లాంటి వ్యక్తుల వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు నా శ్రేయస్సు కోరుకున్న ఇందిరా జైసింగ్.. ఇప్పుడు దోషుల కోసం మాట్లాడం విచిత్రంగా ఉందని నిర్భయ తల్లి మండిపడ్డారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories