కంగనా రనౌత్‌ను సమర్థిస్తూ నిర్భయ తల్లి కీలక వ్యాఖ్యలు

కంగనా రనౌత్‌ను సమర్థిస్తూ నిర్భయ తల్లి కీలక వ్యాఖ్యలు
x
Highlights

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012 డిసెంబర్ 16న బస్సులో 23 ఏళ్ల నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012 డిసెంబర్ 16న బస్సులో 23 ఏళ్ల నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. అత్యాచారం చేసిన వారిలో నలుగురికి ఫిబ్రవరి 1న మరణశిక్ష అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడిన కిరాతకులకు మరణశిక్ష కోసం తీవ్రంగా పోరాడడం ద్వారా నిర్భయ తల్లి ఆశాదేవి ఎంతో గుర్తింపు సంపాదించారు. ఈ నేపథ్యంలో సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ నిర్భయ తల్లి ఆవేదన అర్ధం చేసుకోగలను , కానీ, రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీని సోనియా గాంధీ క్షమించారని, ఆమెకు ఉరిశిక్ష పడాలని కోరుకోలేదని గుర్తు చేశారు. సోనియాను చూసి నిర్భయ తల్లిని కోరుతున్నానని అన్నారు. ఆమెకు మద్దతు ఉంటుందని, ఉరి శిక్షకు మాత్రమే వ్యతిరేకం అని ఇందిరా జైసింగ్ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ వ్యాఖ్యలపై నిర్భయ తల్లితో సహా పలువురు ప్రముఖులు విమర్శలు ఎక్కుపెట్టారు. తాజాగా కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. ఇందిరా జైసింగ్ వ్యాఖ్యలు సరైంది కాదని విమర్శించారు. అలాంటి మహిళలను దోషులతో పాటు నాలుగు రోజుల పాటు జైళ్లో ఉంచాలి, కచ్చితంగా వారితో కలిసి ఉండేలా చేయాలి. అప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి వాళ్లే మృగాళ్లకు, హంతకులకు జన్మనిస్తారు అని తీవ్ర స్థాయిలో కంగనా రనౌత్ ధ్వజమెత్తారు.

అయితే దీనిపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. కగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యల్లో ఇందిరా జైసింగ్‌ను నాలుగు రోజులు దోషులతో బంధిస్తే ఆమెకు బాధ తెలిసి వస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఆశాదేవి స్పందిస్తూ.. నేను కంగనా రనౌత్ వ్యాఖ్యలు అంగీకరిస్తున్నాను. కంగనా చెప్పింది నిజమే. న్యాయవాది ఇందిరా జైసింగ్‌కు వ్యతిరేకంగా కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. అందుకు ఆనందంగా ఉంది. అత్యాచార నిందితులను బహిరంగంగా ఉరి తీయాలన్న కంగన రనౌత్ మాటల్లో తప్పు లేదు. ఇలా చేస్తే భవిష్యత్తులో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరగకుండా అరికట్టవచ్చు అని నిర్భయ తల్లి ఆశాదేశి అన్నారు. నిర్భయపై దారుణం జరిగినప్పుడు ఏం జరిగిందే తనకు తెలుసని అన్నారు. మరికొన్నిరోజుల్లో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories