Nirbhaya Case: సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన పవన్ కుమార్

Nirbhaya Case: సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన పవన్ కుమార్
x
నిర్భయ దోషి పవన్ కుమార్ (ఫైల్ ఫోటో)
Highlights

నిర్భయ కేసులో నిందితుడిగా ఉన్న పవన్ కుమార్ మరో నాటకానికి తెరతీశాడు. తాజాగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇందులో మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పేర్కొన్నాడు.

నిర్భయ కేసులో నిందితుడిగా ఉన్న పవన్ కుమార్ మరో నాటకానికి తెరతీశాడు. తాజాగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇందులో మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పేర్కొన్నాడు. అలాగే , దిగువ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని పవన్‌ కుమార్ గుప్తా డిమాండ్ చేశారు. అంతేకాదు పవన్ తన పిటిషన్లో నేరం జరిగినప్పుడు తాను మైనర్ అని పేర్కొన్నాడు.
ఇప్పటికే వీరి ఉరిశిక్ష రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో ఉరికి నాలుగు రోజుల ముందు పవన్ కుమార్ క్యూరేటివ్ పిటిషన్ ను దాఖలు చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికే అతను ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

కాగా పవన్ కుమార్ తో సహా నలుగురు దోషులను ఉరితీయాలని ఇప్పటికే ఢిల్లీ హైకోర్ట్ డెత్ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 3న నలుగురు నిందితులను ఉరి తీయనున్నారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నందున దోషుల ఉరిశిక్ష గతంలో రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో మరోసారి సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories