మరోసారి నిర్భయ దోషుల 'ఉరి' అమలు వాయిదా

మరోసారి నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా
x
Highlights

మరోసారి నిర్భయ నిందితుల ఉరి అమలు వాయిదా పడింది. డెత్ వారెంట్ పై పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉరిశిక్షను...

మరోసారి నిర్భయ నిందితుల ఉరి అమలు వాయిదా పడింది. డెత్ వారెంట్ పై పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉరిశిక్షను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పవన్ కుమార్ గుప్తా పిటిషన్ పై ఈ ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. ఇదిలావుంటే పవన్ కుమార్ గుప్తా పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు. అంతకుముందు పవన్ నివారణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఆయన అభ్యర్థించారు. దీనికి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం శిక్షను పునఃపరిశీలించే ప్రశ్న లేదని పిటిషన్ ను కొట్టివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories