నిర్భయ దోషుల ఉరికి తీహార్ జైలు అధికారుల రెడీ.. 16న ఇసుక బస్తాలతో డమ్మీ ఉరి!

నిర్భయ దోషుల ఉరికి తీహార్ జైలు అధికారుల రెడీ.. 16న ఇసుక బస్తాలతో డమ్మీ ఉరి!
x
Highlights

నిర్భయ నిందితులకు డెత్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరి తీసేందుకు డెత్ వారంట్ జారీ అయిన నేపథ్యంలో ముందుగా ఈ నెల...

నిర్భయ నిందితులకు డెత్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరి తీసేందుకు డెత్ వారంట్ జారీ అయిన నేపథ్యంలో ముందుగా ఈ నెల 16వతేదీన ఇసుకబస్తాలతో డమ్మీ ఉరి తీసేందుకు తిహార్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉరి శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించే తీహార్ జైలు గదిని ఖరారు చేశారు. తీహార్ జైలులోని మూడో నంబరు జైలు గదిలో నిర్భయ దోషులను ఉరి తీయాలని నిర్ణయించారు.

గత నెలలో బక్సర్ జైలు నుంచి కొనుగోలు చేసిన కొత్త ఉరి తాళ్లతో ఇసుక బస్తాలను ఉపయోగించి 16వ తేదీ ఉదయం డమ్మీ ఉరి తీయనున్నట్లు తిహార్ జైలు సిబ్బంది తెలిపింది. నిర్భయ దోషులైన పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేశారు. ఇసుక బస్తాలకు ఉరి తాళ్లు బిగించి డమ్మీ ఉరి తీయాలని జైలు అధికారులు నిర్ణయించారు. దోషులందరినీ ప్రస్తుతం తీహార్‌ జైలు నంబర్‌ మూడులో వేర్వేరు గదుల్లో ఉంచి సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జైలు నంబర్‌ 3లోనే దోషులకి ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories