నిర్భయ దోషుల పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం

నిర్భయ దోషుల పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం
x
Highlights

కొన్నేళ్ల కిందట దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కొన్నేళ్ల కిందట దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో దోషులు వేసిన పిటిషన్ లాయర్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. నిర్భయ కేసులో దోషుల తరఫున న్యాయవాది ఏపీ సింగ్‌ వాదనలు వినిపించారు. దోషుల్లో ఒకడైన వినయ్‌పై విష ప్రయోగం జరిగిందన్నారు. అందుకే వినయ్ శర్మను ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు. కానీ, దీనికి సంబంధించిన మెడికల్‌ రిపోర్టులను అధికారులు ఇవ్వలేదని న్యాయస్థానంలో తెలిపారు.

అయితే ప్రస్తుతం దోషులు వినయ్‌ శర్మ మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కోర్టుకు తెలిపారు. ఆహారం తీసుకోవడం లేదని.. మెడికల్ రిపోర్టులు ఇస్తే క్షమాభిక్ష కోసం ఉపయోగపడతాయని న్యాయవాది కోర్టులో విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు పిటీషన్లు కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.

నిర్భయ దోషులు క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్లు రిపోర్టులు తీహాడ్‌ జైలుఅధికారులు ఇవ్వలేదని ఆరోపిస్తూ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ శుక్రవారం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలసిందే. వినయ్‌ శర్మ డైరీ, పెయింటింగ్స్‌ను జైలు అధికారులు ఇవ్వలేదని ఆరోపించారు. అధికారుల దగ్గర నుంచి తీసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కూడా తన వాదనలు కోర్టులో వినిపించారు. తీహాడ్‌ జైలు అధికారులు దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌కు అన్ని పత్రాలను ఇచ్చినట్లు తెలిపారు. దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు పిటిషన్ల వేస్తూ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌పై శనివారం కోర్టులో విచారణ జరిపిన సెషన్స్‌ జడ్జి అజయ్‌ కుమార్‌ జైన్‌ పిటిషన్లను కొట్టి వేశారు.

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి ఖరారయ్యింది. ఫిబ్రవరి 1న ఉదయం 6గంటలకు ఉరి తీయ్యాలంటూ ఢిల్లీ హైకోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. నిర్భయ దోషులను ఈ నెల 22న ఉరి శిక్ష విధిస్తూ పటియాల కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌తో వీరి ఉరిశిక్ష ఆలస్యమైంది. రాష్ట్రపతి, క్షమాభిక్షను తిరస్కరించడంతో వీరికి ఉరి శిక్ష అమలుకు అడ్డంకులు తొలగాయి. దీంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించనున్నారు. 2012లో నిర్భయపై నిందితులు ముకేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories