బ్రేకింగ్ : నిర్భయ కేసులో మరో ట్విస్ట్‌

బ్రేకింగ్ : నిర్భయ కేసులో మరో ట్విస్ట్‌
x
Highlights

నిర్భయ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నిర్భయ దోషుల ఉరితీత మరింత ఆలస్యం కానుంది. అత్యాచారం హత్య కేసులో ఓ దోషి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో...

నిర్భయ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నిర్భయ దోషుల ఉరితీత మరింత ఆలస్యం కానుంది. అత్యాచారం హత్య కేసులో ఓ దోషి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో జనవరి 22న ఉరిశిక్ష అమలు జరగదని హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం విన్నవించింది. రాష్ట్రపతి వద్ద నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌‌లో ఉంది. క్షమాభిక్ష పిటిషన్‌, ఉరిశిక్ష అమలు మధ్య14 రోజుల వ్యవధి ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది.

జైలు నిబంధనల ప్రకారం ఉరిశిక్ష పడిన కేసులో దోషుల మెర్సీ పిటిషన్ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉందని, అందుకే శిక్షను అమలు చేయలేమని తేల్చి చెప్పింది. అయితే, తదుపరి విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. తీహార్‌ జైలు అధికారుల తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాభిక్ష పిటిషన్‌ను పంపడంలో ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించింది. దీనిపై జైలు అధికారులను హైకోర్టు ప్రశ్నించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories