Top
logo

జైష్ ఉగ్రవాది జాహిద్ షేక్ ఇంటిపై పోలీసులు దాడి..!

జైష్ ఉగ్రవాది జాహిద్ షేక్ ఇంటిపై పోలీసులు దాడి..!
Highlights

జైష్-ఇ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఏ) నడుం బిగించింది. ఈరోజు ...

జైష్-ఇ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఏ) నడుం బిగించింది. ఈరోజు ఉదయం దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఇందులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల తోపాటు జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. బుధవారం ఉదయం దక్షిణ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా సెర్చ్ నిర్వహించింది. అలాగే అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలుస్తోంది.

పుల్వామాలోని జైష్-ఎ-మొహమ్మద్ సానుభూతిపరుడు జాహిద్ షేక్ ఇంటి దాడి చేసినట్టు సమాచారం.. ఉగ్రవాదుల తో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తోన్న కాకాపోరా, కస్బాయర్ సహా ఇతర గ్రామాలలో కూడా ఈ బృందం దాడి చేసింది. ఈ ప్రాంతంలోని కొందరు యువకులు ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్నారన్న ప్రచారం ఉంది.. ఇప్పటికే చాలా సార్లు ఇక్కడ దాడులు నిర్వహించి జైష్-ఇ-మొహమ్మద్‌ సానుభూతిపరులను అరెస్ట్ చేశారు భద్రతా అధికారులు. తాజాగా మరోసారి సెర్చ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

Web TitleNIA J&K Police raid Jaish terrorist Zahid Sheikh's house, other locations in south Kashmir
Next Story


లైవ్ టీవి