
దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న సంపూర్ణ లాక్ డౌన్ కు ఈనెల 20 నుంచి కొన్ని సడలింపులు వచ్చాయి..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న సంపూర్ణ లాక్ డౌన్ కు ఈనెల 20 నుంచి కొన్ని సడలింపులు వచ్చాయి.. దాంతో అత్యవసర సేవలల్లో భాగంగా అంతర్‌రాష్ట్ర సరుకుల రవాణా ఇంకా సులభతరం కానుంది. ఈ క్రమంలో జాతీయ రహదారులపై టోల్ రుసుములను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వసూలు చేయాలనీ ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీనిపై రవాణా సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి.
కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా అత్యవసర సేవలను సులభతరం చేయడానికి జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం మార్చి 25 న ప్రకటించింది. అయితే తాజాగా " అన్ని ట్రక్కులు వస్తువుల రవాణా వాహనాలకు అంతర్గత రాష్ట్రాల పరిధిలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన సడలింపుల దృష్ట్యా ..
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలను , అవసరమైన చర్యలను NHAI తీసుకోవాలి.. అంతేకాదు 2020 ఏప్రిల్ 20 నుండి టోలింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించబడతాయి " అని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ NHAI కు రాసిన లేఖలో తెలిపింది. దీనిపై అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (AIMTC) అభ్యంతరం తెలిపింది. నిత్యావసర వస్తువుల రవాణా కొనసాగడానికి.. ట్రక్కుల యజమానులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. ప్రస్తుత సంక్షోభ సమయంలో డ్రైవర్లను తీసుకురావడం పెద్ద సవాలుగా మారింది. రవాణా వ్యవస్థ ఆర్థికంగా విచ్ఛిన్నమైంది, కార్యకలాపాలకు ఫైనాన్స్ కూడా లేదు, అయినప్పటికీ ప్రభుత్వం టోల్ రుసుములను వసూలు చేయడం మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రంగాన్ని ఆదుకోవాలి అని AIMTC పేర్కొంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



