మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రపంచమంతా చర్చ జరగాలి

మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రపంచమంతా చర్చ జరగాలి
x
Ram Nath Kovind
Highlights

ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పలు చోట్ల మహిళలపై హేయమైన నేరాలు...

ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పలు చోట్ల మహిళలపై హేయమైన నేరాలు జరిగాయన్నారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు.. సమాజంలో మహిళలకు సమాన హక్కులు, గౌరవం ఇస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ దాడులు కేవలం ఒక ప్రాంతానికో దేశానికో పరిమితం కాదని వ్యాఖ్యానించారు. మానవ హక్కుల్లో వైఫల్యాలు, మహిళలపై హింస కారణంమని, మనం విధుల్లో విఫలమవుతున్నామని తెలిపారు. మానవహక్కుల సార్వత్రిక తీర్మానానికి అనుగుణంగా ప్రపంచమంతా జీవించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కర్తవ్యాలు ఒకే నాణేనికిరెండు వైపులని ఉండాలి గాంధీ అన్నారని గుర్తు చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రపంచమంతా చర్చ జరగాలని రాష్ట్రపతి అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories