Corona Cases in India: భారత్‌లో కొత్తగా 1,49,394 కరోనా కేసులు నమోదు

Corona Cases in India: దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతం

Rama Rao
Published on: 4 Feb 2022 11:12 AM IST
Newly Registered 1,49,394 Corona Cases in India | National News Today
X

భారత్‌లో కొత్తగా 1,49,394 కరోనా కేసులు నమోదు

Corona Cases in India: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో గరిష్ఠానికి చేరిన రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 1.72 కేసులు నమోదవగా, తాజాగా అవి 1.49 లక్షలకు తగ్గాయి. నిన్నటి కంటే 13 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

దేశంలో కొత్తగా లక్షా, 49వేల, 394 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, గత 24 గంటల్లో 1072 మంది బాధితులు మహమ్మారికి బలవగా, 2 లక్షల, 46వేల, 674 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు తగ్గడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 168.47 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

నిన్న కేరళలో అత్యధికంగా కేరళలో 42వేల, 677 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 16వేల, 436, మహారాష్ట్ర 15వేల, 252, తమిళనాడు 11వేల, 993, రాజస్థాన్‌లో 8073 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Rama Rao

Rama Rao

Next Story