నాలుగు గోడలకే పరిమితమైన కొత్త సంవత్సరం వేడుకలు

నాలుగు గోడలకే పరిమితమైన కొత్త సంవత్సరం వేడుకలు
x
Highlights

* ఇళ్లలోనే బంధుమిత్రుల నడుమ వేడుకలు * కోవిడ్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉన్నందున తగ్గిన అలికిడి * పోలీసుల హెచ్చరికలతో సద్దుమణిగిన సందడి

ఎక్కడికక్కడ ఆంక్షలు.. నిర్మానుష్యంగా రోడ్లు.. క్రాకర్ చప్పుళ్లు లేవు.. యువతల హంగామా లేదు. అంగరంగ వైభవంగా కొత్త ఏడాదికి స్వాగతం పలకాల్సిన వేడుక.. నాలుగు గోడలకే పరిమితమైంది. బయటకు సంబురం కనిపించకపోయినా. మనసులో ఉత్తేజం మాత్రం ఆగలేదు. ఎవరి ఇళ్లలో వారు బంధుమిత్రుల మధ్య కొత్త ఏడాది వేడుకలు జరుపుకొన్నారు.

ఈ ఏడాది న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ఆంక్ష‌ల న‌డుమ అంతంత‌మాత్రంగానే జ‌రిగాయి. కోవిడ్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉన్న నేప‌ధ్యంలో ప్రైవేట్ పార్టీస్, స్పెషల్ ఈవెంట్స్ కు అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డంతో హంగామా లేకుండానే నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుపుకున్నారు ప్ర‌జ‌లు. ప‌బ్స్, క్ల‌బ్స్ , స్టార్ హోటల్స్ కు సైతం ప్ర‌జ‌ల తాకిడి లిమిటెడ్ గానే ఉంది. ముంద‌స్తుగానే పోలీసులు హెచ్చ‌రించిన క్ర‌మంలో ప‌బ్స్ లో కూడా ప్ర‌తీసారి క‌నిపించే హ‌డావిడి క‌రువైంది.

న‌గ‌రంలోని మూడు క‌మీష్ న‌రేట్ ల ప‌రిధిలో దాదాపు 100 స్పెష‌ల్ టీమ్స్ తో డ్రంక్ ఎండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హించారు పోలీసులు. రాత్రి 11 గంట‌ల నుండి డ్రంక్ ఎండ్ డ్రైవ్ త‌నిఖీల‌తో పాటు న‌గ‌రంలోని ఫ్లై ఓవ‌ర్లు అన్నీ కూడా మూసివేశారు. ఇక గ‌త ఏడాదితో పోలిస్తే ఈసారి వేడుక‌ల్లో రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గాయ‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories