దడపుట్టిస్తున్న కోవిడ్‌ కొత్త వేరియంట్లు... ఒమిక్రాన్‌ నుంచి మరో రెండు పుట్టినట్టు నిర్ధారణ

New Variants of Covid-19 in World | Telugu News
x

దడపుట్టిస్తున్న కోవిడ్‌ కొత్త వేరియంట్లు... ఒమిక్రాన్‌ నుంచి మరో రెండు పుట్టినట్టు నిర్ధారణ

Highlights

*అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ముందస్తు చర్యలకు సిద్ధమైన కేంద్ర ఆరోగ్య శాఖ

New Variants of Covid-19: ఒకవైపు కోవిడ్‌ ఉధృతి తగ్గుతుంటే మరోవైపు కొత్త వేరియంట్లు దడపుట్టిస్తున్నాయి. ప్రతి నాలుగు నెలలకోసారి కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరో రెండు ఉపకారకాలుగా మార్పు చెందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా ఒమిక్రాన్‌ నుంచి బీఏడాట్‌4, బీఏడాట్‌5 వేరియంట్లు దక్షిణాఫ్రికాలో భయటపడ్డాయి. అయితే వాటి తీవ్రత ఎలా ఉంటుందనేది మాత్రం తెలియలేదు. వాటిపై అధ్యయనం చేస్తున్నట్టు మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నా మృతుల సంఖ్య మాత్రం అత్యల్పంగా ఉండడం కాస్తా ఉపశమనం కలిగిస్తోంది. అయితే ఇప్పుడు పెరుగుతున్న కేసుల్లో ఒమిక్రాన్‌ నుంచి పుట్టిన వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. నిన్న మొన్నటివరకు ఒమిక్రాన్‌ నుంచి పుట్టిన బీఏడాట్‌1, బీఏడాట్‌2 కలయితో పుట్టిన కొత్త వేరియంట్‌ ఎక్స్‌ఈ కలకలం రేపింది. అయితే తాజాగా మరో రెండు వేరియంట్లను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. బీఏడాట్‌4, బీఏడాట్‌5 వేరియంట్ల కేసులు దక్షిణాఫ్రికాలో పెరుగుతున్నట్టు నిర్ధారించింది. అంతర్జాతీయ గణాంకాల మేరకు పలు దేశాల్లో ఈ కొత్త వేరియంట్లకు సంబంధించిన డజన్ల కొద్ది కేసులు బయటపడుతున్నాయి.

ఇటీవల చైనాలోనూ కొత్త రకం వైరస్‌ను అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు. బీఏడాట్‌1. బీఏడాట్‌2, బీఏడాట్‌3 వేరియంట్ల నమూనాలకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. అయితే దానిపై పూర్తి వివరాలను మాత్రం ప్రకటించలేదు. అయితే డబ్ల్యూహెచ్‌వో మాత్రం తాజాగా కొత్త వేరింయట్లను గుర్తించింది. బీఏడాట్‌4, బీఏడాట్‌5 వేరియంట్లుగా నామకరణం చేసింది. ఈ రకం వేరియంట్‌ ఇప్పటికే బోట్సోవానా, బెల్జియం, జెర్మనీ, డెన్మార్క్‌, బ్రిటన్‌లో గుర్తించినట్టు డబ్ల్యూహెచ్‌వో వివరించింది. బీఏడాట్‌4, బీఏడాట్‌5లో అధిక మ్యూటేషన్లు ఉన్నందున్న ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ వేరియంట్ల కేసులు పెరుగుతున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం అత్యల్పంగా ఉంది. దీంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దక్షిణాఫ్రికాలోని సెంటర్‌ ఫర్‌ ఎపిడమిక్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌-సీఈఆర్‌ఐ తెలిపింది. అయితే టీకా తీసుకున్నవారికి కూడా ఈ కొత్త వేరియంట్లు సోకుతున్నాయని చెప్పింది. టీకా సుకున్నందుకే ప్రాణాపాయం ప్రమాదం భారీగా తగ్గిందని డబ్ల్యూహెచ్‌ స్పష్టం చేస్తోంది.

మన దేశంలో కూడా కొత్త వేరియంట్ల కేసులు నమోదువుతున్నాయి. ఇటీవల గుజరాత్‌, ముంబైలో ముగ్గురికి ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. అయితే కొత్త వైరస్ సోకినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తి, ప్రాబల్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణతోపాటు కేసులపై నిఘా పెంచాలని అధికారులకు సూచించారు. కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఔషధాల లభ్యతపై సమీక్ష చేసుకోవడంతోపాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు యువతకు కూడా బూస్టర్‌ డోస్‌ టీకాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

ప్రతి నాలుగు నెలలకొక కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తున్నది. తాజాగా ఆసియాలో భారీగా కేసులు పెరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండకపోతే మరో ప్రమాదం ముంచుకొస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రపంచ దేశాల ప్రజలు అప్రమత్తమై.. టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం నిత్యం 15 లక్షల కేసులు నమోదువుతున్నాయని ఐరోపాలో మరో వేవ్‌ దిశగా పరిస్థితులు దారి తీస్తున్నాయని తెలిపింది. యూకేలో కొత్తగా గుర్తించిన ఓమిక్రాన్‌ వేరియంట్‌ ఎక్స్‌ఈ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ దేశాలు అప్రమత్తమవ్వాలని సూచించారు. వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామని వాటిపై అధ్యయనం చేస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంటే చైనాలో మాత్రం రోజు రోజుకు కేసులు పెరుతున్నాయి. తాజాగా చైనాలో 28వేల కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 15 వందల 13 కేసులు లక్షణాలతో ఉన్నాయని మిగిలిన 26వేల 525 కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేవని చైనా ప్రకటించింది. షాంఘై నగరంలో కఠిన కోవిడ్‌ నిబంధనలు విధించిన చైనా ఎవరైనా ఉల్లంఘిస్తే పోలీసు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories