రైలు, బస్సు, విమానాలకు మొదలైన బుకింగ్స్... కానీ కండిషన్ అదే!

రైలు, బస్సు, విమానాలకు మొదలైన బుకింగ్స్... కానీ కండిషన్ అదే!
x
Highlights

కరోనాని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

కరోనాని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. అయితే ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ని పోడిగిస్తారా లేదా అన్నది చూడాలి మరి, ఇక లాక్ డౌన్ పోడిగిస్తారు అంటూ వస్తున్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. కానీ ఒకపక్క మాత్రం దేశవ్యాప్తంగా మాత్రం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే... గత నెల 23 నుండి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లుగా ప్రధాని ప్రకటించగానే రైళ్ళు, బస్సులు, విమాన ప్రయాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. లాక్ డౌన్ 14తో ముగుస్తుండడంతో బస్సు, రైళ్లు , విమాన సర్వీస్ లకు సంబంధించి బుకింగ్ లు మళ్ళీ మొదలయ్యాయి..

ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచి 23 వరుకు రైళ్ల రిజర్వేషన్లన్నీ నిండిపోయి వెయిటింగ్ లిస్ట్ నుంచి రిగ్రెట్ వరుకు వెళ్లిపోయాయి. అయితే లాక్ డౌన్ ఒకవేళ కొనసాగిస్తే బుకింగ్స్ క్యాన్సిల్ చేస్తామనే షరతుతో బుకింగ్ లు జరుగుతున్నాయి ..

విశాఖ, హైదరాబాద్ ,చెన్నై, భువనేశ్వర్ వెళ్ళే రైళ్లకు సంబంధించి స్లీపర్ ,సెకండ్ ఏసీ ,థర్డ్ ఏసీ సీట్లన్నీ చాలావరకు బుకింగ్ అయిపోయాయి. ఏప్రిల్ 19వ తేదీ వరకు సీట్లన్నీ ఫుల్‌ అయిపోయాయి.. అలాగే ఆర్టీసీ బస్సుల ఆన్‌లైన్‌ బుకింగ్‌కు ఆర్టీసీ వెబ్‌సైట్‌ తెరుచుకుంది.

విశాఖ, చెన్నై, హైదరాబాద్‌ రూట్లలో ప్రైవేటు బస్సులు ఆన్‌లైన్‌ బుకింగ్‌లు తీసుకుంటున్నాయి .. ఇక గూడ్స్‌ రైళ్లు బాగానే తిరుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో కూడా పార్సిల్ ఎక్సపోర్ట్ కోసం స్పెషల్ పార్సిల్ ఎక్సప్రెస్ ను దక్షిణమధ్య రైల్వే నడుపుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories