New PF Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్?

ఈపీఎఫ్‌వో (ఫైల్ ఫోటో )
New PF Tax Rules: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం షాకిచ్చేందుకు రెఢీ అయ్యింది.
New PF Tax Rules: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం షాకిచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటివరకు ఈపీఎఫ్ నుంచి పొందిన వడ్డీకి టాక్స్ మినహాయింపు ఉన్న విషయం ఖాతాదారులకు తెలిసిందే. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు మారనున్నాయి. ఈపీఎఫ్ లో ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసే ఖాతాదారులకు అందించే వడ్డీపై పన్నులను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ప్రకటించారు.
అంటే ఏడాదికి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ .2.5 లక్షలకు మించితే.. అందుకు పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నది సారాంశం. అయితే కేవలం ఉద్యోగులు జమ చేసే మొత్తంపైనే ఈ పన్నును లెక్కించనున్నారు. 1, ఏప్రిల్ 2021 నుంచి ఇది అమలులోకి వస్తుంది. పీఎఫ్‌లో ఉద్యోగి వాట ఏడాదికి రూ.2.5 లక్షల లోపు ఉంటే 80సీ కింద ఎప్పటిలానే మినహాయింపు ఉంటుంది.
పీఎఫ్‌లో ఉద్యోగితో పాటు తను పని చేస్తున్న సంస్థ కూడా ఉద్యోగి తరఫున కొంత జమ చేస్తుంది. అయితే ఈ మొత్తానికి కొత్త నిబంధనలు వర్తించవు. కేవలం ఉద్యోగి వాటాపై మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. ఉద్యోగుల ఆదాయపు పన్ను ట్యాక్స్ శ్లాబ్ ప్రకారం ఈ ట్యాక్స్ ను లెక్కిస్తారు. ఉద్యోగి ఎంత శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తే అంత శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగి 20 శాతం ట్యాక్స్ శ్లాబ్ పరిధిలోకి వస్తే అతను 20 శాతాన్ని పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంపై త్వరలోనే ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMTT-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్- సీఎం కేసీఆర్
28 Jun 2022 2:30 PM GMTప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి..
28 Jun 2022 2:18 PM GMT