పాముకాటుకు కొత్తమందు తయారీ

పాముకాటుకు కొత్తమందు తయారీ
x
పాముకాటుకు కొత్తమందు తయారీ
Highlights

పాముకాటుకు ఎంతోమంది బలి అవుతున్నారు. కొంతమంది నాటువైద్యాన్ని ఆశ్రయిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. పాముకాటు విరుగుడు మందులకు ఆస్పత్రుల్లో కొరత...

పాముకాటుకు ఎంతోమంది బలి అవుతున్నారు. కొంతమంది నాటువైద్యాన్ని ఆశ్రయిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. పాముకాటు విరుగుడు మందులకు ఆస్పత్రుల్లో కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం పాముకాటు బాధితులకు వాడుతున్న యాంటీ వీనం సీరం అనే మందు కొన్నిసార్లు పని చేయడం లేదు. అనేక సందర్భాల్లో దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయి. యాంటీ వీనం సీరం వేశాక కొంతమందిలో బీపీ పడిపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి.

పాము విషాన్ని గుర్రంలో ప్రవేశపెట్టి యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తారు. వాటిని శుద్ధి చేసి యాంటీ వీనం సీరం తయారు చేస్తారు. గుర్రంలోని ప్రతిదేహకాలు, మనుషుల్లోని ప్రతిదేహకాలు ఒకటి కానందున అనేకసార్లు దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. పూర్తిస్థాయిలో విరుగుడుగా పని చేయట్లేదు. అయితే పాముకాటుకు దుష్ర్పభావం లేని మందు తయారీకి అడుగులు పడ్డాయి. పాముకాటు మందుకు కొరత లేకుండా ఆధునిక పద్ధతిలో ల్యాబొరేటరీల్లో తయారు చేసే విధానం అందుబాటులోకి రానుంది. దీనిపై భారతీయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలితాలిచ్చాయి. నేచర్ జెనెటిక్స్ అనే వెబ్‌ సైట్ తాజా సంచికలో ఆ వివరాలను వెల్లడించింది.

అత్యాధునిక జన్యు సాంకేతిక పరిజ్ఞానం కలియికను ఉపయోగించి మన నాగుపాములకు సంబంధించిన జన్యువులను శాస్త్రవేత్తలు సమీకరించారు. పాము కాటు మరణాల్లో మూడోవంతు ఈ రకపు విషాలే కారణమని నిర్దారించారు. వీటిని సింథటిక్ పద్ధతిలో లేబొరేటరీల్లో యాంటీ వీనం తయారు చేసి ప్రస్తుత పాము కాటు మందును ఆధునీకరించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. దీని వల్ల వందశాతం సమర్థవంతంగా పని చేస్తుందని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories