ఒక్కరోజే 212 కోట్లు తాగేశారు!

ఒక్కరోజే 212 కోట్లు తాగేశారు!
x
Highlights

* డిసెంబర్‌ 31న రూ.212 కోట్ల విలువైన మద్యం విక్రయాలు * రాష్ట్రవ్యాప్తంగా 2,216 వైన్‌ షాపులు * వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు

డిసెంబర్‌ థర్టీ ఫస్ట్ అంటేనే ఒక కొత్త జోష్‌. గడిచిన ఏడాది ఎలా ఉన్నా రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతున్నా.. దానితో సంబంధం లేకుండా సెలబ్రేషన్స్ జరుపుకునే సమయం. ఇక మద్యం ప్రియుళ్ల గురించి అయితే సపరేట్‌గా చెప్పాల్సిన అవసరమే లేదు. న్యూఇయర్‌ వేడుకల కోసం కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని మరీ ఎదురుచూస్తుంటారు. బంధువులు, స్నేహితులతో కలిసి మద్యం సేవించి చిందులు వేస్తారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ హ్యాపీగా గడుపుతారు.

ఇక న్యూఇయర్‌ వేడుకలు అటు చికెన్‌, మటన్ తదితర వాటితో పాటు మద్యం అమ్మకాల్లోనూ జోష్‌ నింపుతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్‌ 31న ఏకంగా 212 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఓ వైపు కరోనా కొత్త స్ట్రెయిన్‌, పోలీసు నిబంధనలు అమల్లో ఉండడంతో కొంతమంది మందుబాబులు ఇళ్లకే మద్యం, బీరు బాటిళ్లను తెచ్చుకుని తాగేశారు.

తెలంగాణలో మొత్తం 2వేల 216 మద్యం షాపులు, వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు ఉన్నాయి. వీటి ద్వారా 31న విక్రయించిన మద్యం, బీరు విలువ 212 కోట్లుగా ఎక్సైజ్‌ అధికారులు తేల్చారు. ప్రతి జిల్లాలోని విక్రయాలను ఆ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నమోదు చేస్తారు. ఇలా జిల్లాల నుంచి వచ్చిన విక్రయాల వివరాలను గణించిన ఎక్సైజ్‌ కమిషనరేట్‌ 31న 212 కోట్ల విక్రయాలు సాగినట్లు తేల్చింది. నిజానికి సాధారణ రోజుల్లో మద్యం దుకాణాలు, బార్ల ద్వారా రోజుకు సగటున 80 నుంచి 100 కోట్ల విక్రయాలు జరుగుతుంటాయి. కానీ 31న రెట్టింపు స్థాయిలో విక్రయాలు జరిగాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories