
ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఉదయం కరోనా వైరస్ పాజిటివ్ రోగుల సంఖ్య 748 కు పెరిగింది. యుపిలో కొత్తగా 21 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఉదయం కరోనా వైరస్ పాజిటివ్ రోగుల సంఖ్య 748 కు పెరిగింది. యుపిలో కొత్తగా 21 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.ఉన్నవోలో మొదటి కేసు నమోదయింది. మిగతావి లక్నోలో ఇద్దరు, ఆగ్రాలో 18 మందికి వైరస్ పాజిటివ్ అని తేలింది. మొత్తంగా ఇప్పుడు ఆగ్రాలో 167 మంది కోవిడ్ రోగులు ఉన్నారు, లక్నోలో 77 మందికి చేరుకున్నారు.
కాగా మొత్తం కేసుల్లో 447 మందికి జమాత్ ద్వారా వైరస్ సోకింది, ఇప్పటివరకు, కరోనా కారణంగా 13 మంది మరణించారు. వారిలో మీరట్, బస్తీ, వారణాసి, లక్నో, బులాండ్షహర్, కాన్పూర్ లలో ఒక్కొక్కరు.. మొరాదాబాద్ జిల్లాలో ఇద్దరు, ఆగ్రాలో 5 గురు ఇప్పటివరకు మరణించారు. ఇప్పటివరకు 57 మందికి నయమైంది.
ఉత్తర ప్రదేశ్ లో ఈ ప్రాంతాలలో వైరస్ కేసులు నమోదయ్యాయి.. అందులో ఆగ్రా 167, లక్నో 77, ఘజియాబాద్ 27, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) 82, లఖింపూర్ ఖేరి 4, కాన్పూర్ నగర్ 18, పిలిభిత్ 2, మొరాదాబాద్ 21, వారణాసి 9, షామ్లీ 22, జౌన్‌పూర్ 4, బాగ్‌పట్ 14, మీర్ 12, బస్తీ 16, హపూర్ 15, ఘాజిపూర్ 5, అజమ్‌గడ్ 6, ఫిరోజాబాద్ 25, హర్డోయి 2, ప్రతాప్‌గడ్ 6, సహారాన్‌పూర్ 53, షాజహన్‌పూర్ 1, బండా 2, మహారాజ్‌గంజ్ 6, హత్రాస్ 4, మీర్జాపూర్ 2, రాయ్ బరేలి 2, ఆరైయా 5 కౌషాంబి 2, బిజ్నోర్ 9, సీతాపూర్ 14, ప్రయాగ్రాజ్ 1, మధుర 4 మరియు బడాన్ 2, రాంపూ 6, ముజఫర్నగర్ 5, అంరోహ 10, భాదోహి 1, కసగంజ్ 3 అలాగే ఇతర ప్రాంతాల్లో 7 కేసులు నమోదయ్యాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



