New Baggage Rules 2026: విదేశాల నుంచి వచ్చే వారికి కేంద్రం బంపర్ ఆఫర్.. మహిళలకు 40 గ్రా. .. పురుషులకు 20 గ్రా.. ఇక ఆభరణాలపై నో ట్యాక్స్!

New Baggage Rules 2026
x

New Baggage Rules 2026: విదేశాల నుంచి వచ్చే వారికి కేంద్రం బంపర్ ఆఫర్.. మహిళలకు 40 గ్రా. .. పురుషులకు 20 గ్రా.. ఇక ఆభరణాలపై నో ట్యాక్స్!

Highlights

New Baggage Rules 2026: విదేశీ ప్రయాణికులకు కేంద్రం తీపి కబురు! కొత్త 'బ్యాగేజీ నిబంధనలు 2026' అమల్లోకి వచ్చాయి. మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల బంగారు ఆభరణాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు.

New Baggage Rules 2026: విదేశాల నుంచి విమాన లేదా సముద్ర మార్గాల్లో భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 2016 నాటి పాత నిబంధనలను సవరిస్తూ, ‘బ్యాగేజీ నిబంధనలు 2026’ను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి తెచ్చింది.

బంగారు ఆభరణాలపై భారీ ఊరట: కొత్త నిబంధనల ప్రకారం, విదేశాల్లో ఏడాదికి పైగా నివసిస్తున్న భారతీయులు లేదా భారత సంతతి పర్యాటకులు తమ వెంట తెచ్చుకునే బంగారానికి కస్టమ్స్ సుంకం ఉండదు:

మహిళలు: 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు.

పురుషులు: 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు.

గమనిక: ఈ మినహాయింపు కేవలం ఆభరణాలకు (Jewelry) మాత్రమే వర్తిస్తుంది. గోల్డ్ బిస్కెట్లు లేదా కడ్డీలు తెస్తే సుంకం చెల్లించాల్సిందే.

డ్యూటీ-ఫ్రీ పరిమితి పెంపు: విదేశాల నుంచి తెచ్చుకునే వ్యక్తిగత వస్తువుల విలువ పరిమితిని రూ.50,000 నుండి రూ.75,000కు పెంచారు. విదేశీ పర్యాటకులకు ఈ పరిమితి రూ.25,000గా ఉంది.

ఎలక్ట్రానిక్ వస్తువులు & ఇతరాలు:

18 ఏళ్లు దాటిన ప్రయాణికులు తమ వెంట అదనంగా ఒక కొత్త ల్యాప్‌టాప్ లేదా నోట్‌ప్యాడ్‌ను సుంకం లేకుండా తీసుకురావచ్చు.

♦ మద్యం ప్రియులకు 2 లీటర్ల మద్యం, 100 సిగరెట్ల వరకు మినహాయింపు ఉంటుంది.

♦ శాశ్వతంగా భారత్‌కు తిరిగి వచ్చే వారికి (Transfer of Residence), వారు విదేశాల్లో ఉన్న కాలాన్ని బట్టి రూ.1.50 లక్షల నుండి రూ.7.50 లక్షల వరకు గృహోపకరణాలపై మినహాయింపు లభిస్తుంది.

ముఖ్యమైన హెచ్చరిక: సుంకం మినహాయింపు పరిమితి పూర్తిగా వ్యక్తిగతం. ఒకరి పరిమితిని మరొకరితో కలపడం లేదా పంచుకోవడం కుదరదు. అలాగే తుపాకులు, టీవీల వంటి వస్తువులకు ఈ మినహాయింపులు వర్తించవు.

Show Full Article
Print Article
Next Story
More Stories