అంచనాలను తోసిరాజని బీహార్ లో ఎన్డీయే ఘన విజయం!

అంచనాలను తోసిరాజని బీహార్ లో ఎన్డీయే ఘన విజయం!
x
Highlights

* బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార ఎన్డీఏ కూటమి మరోసారి ఘన విజయం * మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధించిన ఎన్డీఏ * మరోసారిప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నితీష్ కుమార్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార ఎన్డీఏ కూటమి మరోసారి ఘన విజయం సాధించింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధించి స్పష్టమైన మెజార్టీ సాధించింది. అధికారం చేపట్టేందుకు 122 అసెంబ్లీ స్థానాలు అవసరం కాగా ఎన్డీఏ 125 సీట్లు సాధించింది. మరోసారి నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమికి 110 స్థానాలు కైవసం చేసుకుంది. నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి మహాకూటమి చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లిన ఎల్జేపీ కేవలం ఒకే సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇతరులు ఎనిమిది చోట్ల విజయం సాధించారు.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారు మారు చేశాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. నున్నా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో మ్యాజిక్ పిగర్ కు అవసరమైన సీట్ల కన్నా ఎన్డీఏ కూటమి ఎక్కువ సీట్లు సాధించింది. మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికల ఫలితాలు ప్రకటించలేదు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి నరాలు తెగే ఉత్కంఠ సాగింది. మహాకూటమి సీఎం అభ్యర్ధి తేజస్వీ యాదవ్ రాఘోపూర్ లో ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హసన్ పూర్ లో విజయం సాధించారు. మాజీ సీఎం జీతన్ రాం మాంఝీ ఇమాజీ గంజ్ లో , ప్రముఖ షూటర్ శ్రేయాసి జముయ్ లో గెలుపొందారు.

ఎన్డీఏ కూటమి గెలుపుతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2005 నుంచి సీఎంగా కొనసాగుతన్న నితీష్ కుమార్ వివిధ కారణాలతో పలుమార్లు రాజీనామా చేసి మళ్లీ సీఎంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే బీహార్ సీఎంగా ఐదుసార్లు ప్రమాణం చేశారు. 2015 ఎన్నికల్లో 80 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ.. తాజా ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినప్పటికీ రాష్ర్టంలో పెద్దపార్టీగానే నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories