అజిత్‌ పవార్‌‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా సూలె

అజిత్‌ పవార్‌‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా సూలె
x
Highlights

శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే రాగానే ఆమె ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అజిత్ పవార్ అసెంబ్లీకి చేరుకున్నారు. దీంతో సుప్రియా సూలె ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో కొత్త ఎన్నికైనా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం ఫడ్నవిస్‌ రాజీనామా చేసిన తర్వాత గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ శాసనసభ సమావేశానికి ఆదేశించారు. అసెంబ్లీలో ప్రొటెం స్వీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్‌ కోలంబకర్‌ నియమించారు. బుధవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేతో కాళిదాస్ ప్రమాణ స్వీకారం చేయించున్నారు.

ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఒకరితర్వాత ఒకరు చేరుకుంటున్నారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలె ముందుగానే అసెంబ్లీకి చేరుకున్నారు. శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే రాగానే ఆమె ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వాగతం పలికారు. ఎన్సీపీ సీనియర్ నేత, అజిత్ పవార్ అసెంబ్లీకి చేరుకున్నారు. దీంతో సుప్రియా సూలె ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.

అనంతరం మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మర్యాదపూర్వకంగా సుప్రియా సూలె కరచాలనం చేశారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవర్ తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. తర్వాత మనసు మర్చుకొని డిప్యూటీ సీఎం పదవి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎన్సీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories